EPAPER

Devdutt Padikkal: చివరి టెస్టులో.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం

Devdutt Padikkal: చివరి టెస్టులో.. దేవదత్ పడిక్కల్ అరంగేట్రం

 


IND vs ENG, 5th Test: Devdutt Padikkal makes debut for India

IND vs ENG, 5th Test Devdutt Padikkal makes debut for India(Sports news headlines): భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లో చివరిదైన అయిదో టెస్ట్ మ్యాచ్ నేడు ప్రారంభం అయింది.  ఇందులో దేవదత్ పడిక్కల్ ఆరంగేట్రం చేశాడు. తుది 11 మంది జట్టులో తనని తీసుకున్నారు. అలాగే వెటరన్ బౌలర్ అశ్విన్ కూడా 100 మ్యాచ్ ల మైలు రాయి అందుకున్నాడు. వీరితో ఇంగ్లాండ్ ప్లేయర్ బెయిర్ స్టో కూడా వందో టెస్టు ఆడారు.


ఇంగ్లాండ్ పై సాధించిన సిరీస్‌ విజయంలో టీమ్ ఇండియాలోని  ప్రతి ఒక్కరూ తమ పాత్ర పోషించారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్  రెండు డబుల్ సెంచరీలు సాధించాడు. అలాగే బౌలింగ్‌ లో బుమ్రా కీలకంగా మారి, జట్టుకి విజయాలు అందించాడు.

ఇక రాజ్‌కోట్‌లో సెంచరీతో శుభ్‌మన్ గిల్ ఫామ్‌ అందుకోవడం, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తొలి సిరీస్‌లోనే అదరగొట్టడం, అశ్విన్‌, జడేజా అటు బంతి, ఇటు బ్యాటుతో రాణించడం, కీలక సమయాల్లో రోహిత్‌ సెంచరీ వంటి అంశాలు భారత్‌కు సిరీస్‌ను అందించాయి.

Read more: మహిళా క్రికెట్లో ఫాస్టెస్ట్ బాల్ ఇదే.. రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా బౌలర్..

ఇప్పుడు అందరి దృష్టి కీలకమైన ఐదో టెస్టు వైపు మళ్లింది. ప్రస్తుతం టీమ్‌ ఇండియా గెలుపే లక్ష్యంగా జట్టులో కొన్ని మార్పులు చేసింది. అశ్విన్ వందో టెస్టులో అడుగు పెట్టాడు. బుమ్రా వచ్చేశాడు. అయితే బుమ్రా, సిరాజ్ లను తీసుకున్నారు. నాలుగో టెస్టులో అద్భుతంగా ఆడిన ఆకాశ్ దీప్ ను పక్కన పెట్టారు. మొత్తానికి కులదీప్ యాదవ్ ను తీసుకున్నారు.

రజత్ పటీదార్ ప్లేస్ లో వచ్చిన దేవదత్ పడిక్కల్ మరి తన ఆరంగేట్రం మ్యాచ్ లో ఎలా ఆడతాడో వేచి చూడాల్సిందే. అలాగే ఇంగ్లాండు జట్టులో వరుసగా విఫలమవుతున్న బెయిర్ స్టో కూడా వందో టెస్ట్ ఆడుతున్నాడు. తన భవిష్యత్తు కూడా ఇదే మ్యాచ్ పై ఆధారపడి ఉంది.

11మంది జట్టులో రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అశ్విన్, కులదీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్ ఉన్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×