EPAPER

Sarfaraz Khans: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. టీమిండియాలోకి సర్ఫరాజ్.. తండ్రి భావోద్వేగం..!

Sarfaraz Khans: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. టీమిండియాలోకి సర్ఫరాజ్.. తండ్రి భావోద్వేగం..!
Sarfaraz Khans

India Vs England 3rd Test: Sarfaraz Khans Debut-Beautiful moment: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే నిజమవుతుంటే.. అన్న పాట చందంగా సర్ఫరాజ్ ఖాన్ ఉద్వేగభరితుడయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు ఎట్టకేలకు టీమిండియా తలుపులు తెరిచింది. 11 మంది ఫైనల్ స్క్వాడ్ లో ఎంపికయ్యాడు. రాజ్ కోట్ లో జరుగుతున్నమూడో టెస్ట్ లో  అరంగేట్రం మ్యాచ్ ఆడనున్నాడు.


భారత సీనియర్ క్రికెటర్ అనిల్ కుంబ్లే చేతుల మీదగా టీమిండియా టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. ఈ క్షణంలో మైదానంలోనే ఉన్న సర్ఫరాజ్ ఫ్యామిలీ భావోద్వేగానికి గురయ్యారు. క్యాప్‌ను అందుకుని,  సర్ఫరాజ్ తన ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాడు.

తండ్రి నౌషద్ ఖాన్ భావోద్వేగంతో కన్నీటిని ఆపుకోలేక పోయాడు. తన కొడుకు కల మాత్రమే కాదు, ఇది తన చిరకాల స్వప్నం అని తెలిపాడు. తన పిల్లలు ఇద్దరిని భారత జట్టులో చూడాలని కోరుకున్నానని తెలిపాడు. వారికి ఆట నేర్పించడానికి ఎన్నో కష్టాలు పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా భార్య రోమన, ఇంకా కుటుంబ సభ్యులందరూ సర్ఫరాజ్ ని కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యారు.


Read more: రోహిత్ హాఫ్ సెంచరీ.. ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ అరంగ్రేటం..

దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మూడేళ్లుగా టీమ్ ఇండియాలో చోటుకోసం సర్ఫరాజ్ పరితపిస్తున్నాడు. అయితే  ఫిట్‌నెస్‌, ఇతర కారణాలతో సెలక్టర్లు పక్కనపెట్టారు. ఎట్టకేలకు తన చిరకాల కోరిక ఫలించింది. భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

సర్ఫరాజ్ తో పాటు వికెట్ కీపర్ ధృవ్ జురెల్ కూడా ఇవాళ మ్యాచ్‌లో అరంగేట్రం చేస్తున్నాడు. వికెట్ కీపర్ కేఎస్ భరత్ పరుగులు చేయడానికి సతమతం అవుతుంటే, విధిలేని పరిస్థితుల్లో ధృవ్ జురెల్ ని తీసుకున్నారు. మరి తనెలా రన్స్ చేస్తాడో చూడాలి.

ఈలోపున ఇషాన్ కిషన్ పై బీసీసీఐ సీరియస్ కావడంతో అతను రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. తను అక్కడ క్లిక్ అయితే ఇంగ్లాండ్ తో జరిగే చివరి రెండు టెస్టులకు జట్టులోకి వస్తాడని అనుకుంటున్నారు.

మరోవైపు రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ రాకతో అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ లు బెంచ్ లకే పరిమితం అయ్యారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×