BigTV English

IND Vs AUS : చివరి రెండు టెస్టులకు అదే జట్టు.. తొలి వన్డేకు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా..

IND Vs AUS : చివరి రెండు టెస్టులకు అదే జట్టు.. తొలి వన్డేకు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా..

IND Vs AUS : బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతోంది. 4 టెస్టుల సిరీస్ లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. సిరీస్ లో 2-0 ఆధిక్యంలో దూసుకుపోయింది. మిగిలిన రెండు టెస్టుల్లో ఒక మ్యాచ్ గెలిచినా సిరీస్ రోహిత్ సేన వసమవుతుంది.


చివరి రెండు టెస్టులకు..
చివరి రెండు టెస్టులతోపాటు ఆసీస్‌ వన్డే సిరీస్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి రెండు టెస్టుల్లో ఆడిన జట్టునే కొనసాగించాలని నిర్ణయించింది. తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ అవకాశం దక్కింది. అదే సమయంలో వైస్ కెప్టెన్సీ నుంచి మాత్రం తప్పించింది. రంజీ మ్యాచ్ ఆడటానికి వెళ్లిన జయదేవ్ ఉనద్కట్ కు మళ్లీ పిలుపొచ్చింది.

మూడో టెస్టు : ఇండోర్ వేదికగా మార్చి 1- 5 వరకు
నాలుగో టెస్టు‌: అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 – 13 వరకు


టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, ఉమేశ్‌ యాదవ్, జయ్‌దేవ్‌ ఉనద్కట్

వన్డే టీమ్..
3 వన్డేల సిరీస్‌ కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొదటి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండటంలేదని వెల్లడించింది. తొలి వన్డేకు హార్దిక్‌ పాండ్య జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలిపింది. అలాగే జయదేవ్ ఉనద్కట్ కు వన్డే జట్టులో స్థానం దక్కింది. అతడు చివరిసారిగా 2013లో వన్డే మ్యాచ్‌ ఆడాడు.

వన్డే సిరీస్‌
తొలి వన్డే: ముంబయి వేదికగా మార్చి 17
రెండో వన్డే: విశాఖపట్నం వేదికగా మార్చి 19
మూడో వన్డే: చెన్నై వేదికగా మార్చి 22

వన్డే జట్టు..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్ధిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, ఇషాన్ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వేంద్ర చహల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×