EPAPER

IND Vs AUS : జడేజా, అశ్విన్ స్పిన్ మాయాజాలం.. ఢిల్లీ టెస్టులో భారత్ సూపర్ విక్టరీ..

IND Vs AUS : జడేజా, అశ్విన్ స్పిన్ మాయాజాలం.. ఢిల్లీ టెస్టులో భారత్ సూపర్ విక్టరీ..

IND Vs AUS : రెండో టెస్టులోనూ భారత్ జయభేరి మోగించింది. సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. 115 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేశాడు. కానీ రోహిత్ అనవసరంగా రనౌట్ అయ్యాడు. రెండో పరుగు తీసే క్రమంలో పూజారా తో సమన్వయం లోపంతో రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


అయితే పూజారాతో జత కలిసి కోహ్లీ జట్టు స్కోర్ ను నెమ్మదిగా పెంచే ప్రయత్నం చేశాడు. జట్టు స్కోర్ 69 పరుగుల వద్ద కోహ్లీ (20) అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. జట్టు స్కోర్ 88 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ (12) కూడా అవుట్ అయ్యాడు. మరో వైపు క్రీజులో పాతుకుపోయిన పూజారా ( 31 నాటౌట్), దాటిగా ఆడిన కీపర్ కేఎస్ భరత్ ( 23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ టెస్టు సిరీస్ లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టులోనూ భారత్ గెలిచింది.

ఓవర్ నైట్ స్కోర్ 61/1 తో పటిష్ట స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా 3 రోజు ఉదయం వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియాను అశ్విన్ తొలుత దెబ్బకొట్టాడు. 65 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ (43) ను పెవిలియన్ కు పంపాడు.
ఆ తర్వాత మరో 20 పరుగులకు స్టివ్ స్మిత్ (9) కూడా అశ్విన్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.


జీరో రన్స్.. 4 వికెట్లు..
ఆ తర్వాత జడేజా ఒక్కసారి విజృంభించాడు. మార్నస్ లుబుసేన్ (35), పీటర్ హ్యాండ్స్ కాంబ్ ( డకౌట్) , కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( డకౌట్) జడేజాకు చిక్కారు. వార్నర్ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన మాట్ రెన్షాను అశ్విన్ బోల్తా కొట్టించాడు. దీంతో ఆసీస్ ఒక్క పరుగు చేయకుండా 95 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. చివరి మూడో వికెట్లు అలెక్స్ క్యారీ (7) , నాథన్ లయన్ (8 ), మథ్యూ కుహ్నమన్ (డకౌట్) ను జడేజా అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది.

తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే కుప్పకూలింది. జడేజాకు 7 వికెట్లు , అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. ఆసీస్ తొలి వికెట్ ఉస్మాన్ ఖావాజా( 6)ను కూడా జడేజా రెండో రోజు అవుట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 1 పరుగు ఆధిక్యం లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసింది. టీమిండియాలో అక్షర్ పటేల్ (74) అద్భుతంగా రాణించాడు. కోహ్లీ ( 44), అశ్విన్ ( 37), రోహిత్ ( 32), జడేజా (26) తొలి ఇన్నింగ్స్ లో కాస్త మెరుగ్గా ఆడారు.

జడేజాకు 10 వికెట్లు..
తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీసిన జడేజా ఈ మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లు తీశాడు. అలాగే అశ్విన్ తొలి ఇన్సింగ్స్ లో 3 , రెండో ఇన్సింగ్స్ 3 వికెట్లు పడగొట్టాడు. షమీ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొత్తం ఆస్ట్రేలియా బ్యాటర్లలో 16 మందిని జడేజా, అశ్విన్ జంట అవుట్ చేయడం విశేషం. అలాగే ఒక ఇన్నింగ్స్ 5 వికెట్ల కంటే ఎక్కువ తీయడం జడ్డూకు ఇది 12వ సారి. ఓ టెస్టులో 10 వికెట్ల ప్రదర్శన రెండోసారి. మొత్తంగా ఈ మ్యాచ్ లో స్పిన్నర్లే భారత్ ను గెలిపించారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ చేసిన స్కోర్ లో సగం కంటే ఎక్కవ అక్షర్, అశ్విన్ , జడేజా కలిసి చేశారు. బౌలింగ్ లో జడేజా, అశ్విన్ దుమ్మురేపితే.. బౌలింగ్ లో ఒక్క వికెట్ తీయకున్నా బ్యాటర్ గా అక్షర్ అదరగొట్టాడు. ఇలా ఈ మ్యాచ్ లో స్పిన్నర్లే మ్యాచ్ విన్నర్లు అయ్యారు.

IND vs AUS: మనోళ్లు గెలిచేనా? ఆస్ట్రేలియాతో టఫ్ ఫైట్!

Rana Naidu:‘రానా నాయుడు’ కోసం వెంక‌టేష్‌, రానా భారీ రెమ్యూనరేషన్స్

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×