EPAPER

IND Vs AUS : రాహుల్ ను తప్పిస్తారా..? గిల్ కు ఛాన్స్ ఇస్తారా..?

IND Vs AUS : రాహుల్ ను తప్పిస్తారా..? గిల్ కు ఛాన్స్ ఇస్తారా..?

IND Vs AUS :బోర్డర్ -గావస్కర్ ట్రోఫిలో భారత్ జట్టు తొలి రెండు టెస్టులను గెలిచి ఆధిక్యంలో ఉంది. అదే ఊపులో ఇండోర్ వేదికగా మార్చి 1 నుంచి జరిగే మూడో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉంది. తొలి టెస్టు ఆడిన సూర్యకుమార్ ను భారత్ రెండో టెస్టులో తప్పించింది. స్కై స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు చోటు కల్పించింది. అయితే అయ్యర్ తొలి ఇన్నింగ్స్ లో 4 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు. అటు ఓపెనర్ రాహుల్ వరసగా విఫలవుతున్నాడు. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 17, రెండో ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు మాత్రమే సాధించాడు. అంతకు ముందు తొలి టెస్టులోనూ రాణించలేదు. కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తం రెండు టెస్టుల్లో కలిపి 3 ఇన్నింగ్స్ ల్లో రాహుల్ 38 పరుగులు మాత్రమే చేయడంపై విమర్శలు వస్తున్నాయి.


రాహుల్ ను తప్పించి శుభ్ మన్ గిల్ కు ఛాన్స్ ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సిరీస్ లోనే కాదు గత కాలంగా టెస్టుల్లో రాహుల్ ప్రదర్శన ఏ మాత్రం బాగోలేదు. అయినా సరే జట్టులో స్థానం కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ నుంచి రాహుల్ ను సెలక్టర్లు తప్పించారు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులో రాహుల్ ను తప్పించి .. గిల్ కు అవకాశం కల్పిస్తారని అంచనాలున్నాయి. లేదా ఒకవేళ గిల్ ను ఓపెనర్ గా పంపి… రాహుల్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించే అవకాశం కూడా ఉంది. రెండో టెస్టులో విఫలమైన అయ్యర్ తప్పిస్తేనా రాహుల్ కు చోటు దక్కుతుంది.

కెప్టెన్ రోహిత్ ఒక్కడే రెండు టెస్టుల్లో నిలకడగా రాణించాడు. హిట్ మ్యాన్ ఒక్కడే ఈ సిరీస్ లో సెంచరీ కొట్టాడు. అలాగే కోహ్లీ, పుజారా క్రీజులో నిలబడుతున్నా భారీ స్కోర్లు సాధించలేకపోతున్నారు. ఈ ఇద్దరూ భారీ ఇన్నింగ్స్ లు ఆడితే భారత్ కు తిరుగుండదు.


ఇక బౌలింగ్ విభాగంలో భారత్ కు పెద్దగా సమస్యలేదు. పేసర్లగా మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తుది జట్టులో ఉంటారు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ త్రయం అలాగే కొనసాగుతుంది. తొలి రెండు టెస్టుల్లో అశ్విన్, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అక్షర్ కు పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం దక్కలేదు. కానీ రెండు టెస్టుల్లో నూ బ్యాట్ తో అక్షర్ పటేల్ అద్భుతంగా రాణించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ కుప్పుకూలే స్థితిలో ఉండగా హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. ఆసీస్ కు భారీ ఆధిక్యం దక్కకుండా చేశాడు. అలాగే తొలిటెస్టులో భారత్ భారీ స్కోర్ చేయడంలోనూ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాడు. అటు జడేజా, అశ్విన్ కూడా బ్యాట్ తో రాణిస్తున్నారు.

అటు ఆస్ట్రేలియా గెలుపు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ ఆడటానికి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా స్వీప్ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించి ఆసీస్ ఆటగాళ్లు భారత్ స్పిన్ వలకు చిక్కుతున్నారు. మొత్తంమీద స్పిన్ ఆడటమే వారికి ఛాలెంజ్ గా మారింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, స్టివ్ స్మిత్ , లబుషేన్, హాండ్స్ కాంబ్ స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. అయితే వారు భారీ స్కోర్లు చేయలేకపోవడం.. క్రీజులో నిలబడిన తర్వాత అవుట్ కావడం ఆసీస్ ను కలవర పెడుతోంది.

బౌలింగ్ విభాగంలో ఆసీస్ కూడా స్పిన్ నే ప్రధానంగా నమ్ముకుంటోంది. కొత్త ఆటగాడు మర్ఫీ తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండో టెస్టులో లైయన్ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడో స్పిన్నర్ కుహ్నెమన్ కూడా రెండో టెస్టులో భారత్ బ్యాటర్లను కాస్త ఇబ్బంది పెట్టాడు. కెప్టెన్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశం వెళ్లడంతో ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా స్టివ్ స్మిత్ వ్యవహరించనున్నాడు. అలాగే స్టార్ పేసర్ స్టార్క్ కూడా బరిలోకి దిగనున్నాడు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×