EPAPER

IND Vs AUS : మూడో వన్డేలో భారత్ ఓటమి… సిరీస్ ఆసీస్ కైవసం..

IND Vs AUS : మూడో వన్డేలో భారత్ ఓటమి… సిరీస్ ఆసీస్ కైవసం..

IND Vs AUS : చెన్నైలో ఆద్యంతం ఆసక్తిగా సాగిన మూడో వన్డేలో భారత్ ఓటమి చవిచూసింది. రోహిత్ సేనపై 21 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి ఆరంభాన్ని అందించారు. తొలి రెండు వన్డేల్లో భారత్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చిన స్టార్క్ ను లక్ష్యం చేసుకుని ఎడాపెడా బౌండరీలు బాదారు. ఆ సమయంలో అబాట్ బౌలింగ్ లో హిట్ మ్యాన్ ( 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 30 రన్స్) అనవసరమైన షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. కాసేపటికే శుభ్ మన్ గిల్ ( 49 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సుతో 37 రన్స్ ) జంపా బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు.


ఈ దశలో కోహ్లీ, కేఎల్ రాహుల్ నిదానంగా ఆడుతూ జట్టు స్కోర్ ను పెంచుకుంటూ వెళ్లారు. వీరు మూడో వికెట్ కు 69 పరుగులు జోడించారు. ఆ సమయంలో భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. కానీ జంపా బౌలింగ్ లో రాహుల్ ( 50 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సుతో 32 రన్స్ ) భారీ షాట్ కు ప్రయత్నించి అబాట్ పట్టిన సూపర్ క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకొచ్చిన అక్షర్ పటేల్ (2) కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు. దీంతో భారత్ 151 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అయినా సరే క్రీజులో కోహ్లీ, హార్ధిక్ పాండ్యా ఉండటంతో భారత్ కే విజయ అవకాశాలు కనిపించాయి.

పాండ్యా దూకుడుగా ఆడితే.. కోహ్లీ సింగిల్స్ తీస్తూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. జట్టు స్కోర్ 185 పరుగుల వద్ద అగర్ బౌలింగ్ లో విరాట్ (72 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సుతో 54 రన్స్) ఓ చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతికే సూర్య కుమార్ యాదవ్ గోల్డెన్ డక్ అయ్యాడు. ఈ సిరీస్ లో మూడు వన్డేల్లోనూ సూర్య తొలి బంతికే అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ పై టెన్షన్ మొదలైంది. హార్థిక్ పాండ్యా, జడేజా క్రీజులో నిలబడినా పరుగులు రావడం కష్టమైంది.


కొట్టాల్సిన రన్ రేట్ 9 పరుగులు దాటిపోవడంతో వేగంగా ఆడే ప్రయత్నంలో పాండ్యా( 40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సుతో 40 రన్స్ ), జడేజా (18) అవుట్ అయ్యారు. ఆ తర్వాత షమీ (14) కాసేపు మెరుపులు మెరుపించినా అప్పటికే మ్యాచ్ భారత్ చేజారింది. చివరకు టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. అగర్ కు 2 వికెట్లు, అబాట్ , స్టొయినిస్ కు తలో వికెట్ దక్కాయి.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ (47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సుతో 47 రన్స్ ) టాప్ స్కోరర్. ఆ జట్టులో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. కానీ 10 మంది బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోర్ సాధించడం విశేషం. కెప్టెన్ స్మిత్ ఒక్కడే డకౌట్ అయ్యాడు. ఒక దశలో ఆసీస్ 138 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది . ఆ సమయలో స్టొయినిస్, క్యారీ నిలబడ్డారు. వారిద్దరూ వెంటవెంటనే అవుట్ కావడంతో ఆసీస్ 203 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. అయితే టెయిల్ ఎండర్లు బ్యాట్ కు పని చెప్పడంతో చివరి మూడు వికెట్లకు ఆసీస్ 66 పరుగులు జోడించింది. అలెక్స్ క్యారీ (38), ట్రావిస్ హెడ్ (33), లబుషేన్ (28), అబాట్ (26), స్టొయినిస్ ( 25), వార్నర్ (23) ఇలా బ్యాటర్ల అందరూ ఫర్యాదలేదనించే సోర్లు చేయడంతో ఆస్ట్రేలియా మంచి లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచగలిగింది. భారత్ బౌలర్లలో కులదీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా తలో మూడు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేలో మాత్రమే భారత్ గెలిచింది. విశాఖలో జరిగిన రెండో మ్యాచ్ లో టీమిండియాను ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్ ల్లోనూ బ్యాటింగ్ లో రాణించిన ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ కు ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. జంపాకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×