EPAPER

Ind vs Aus : ఆస్ట్రేలియా టార్గెట్ 241 రన్స్.. బౌలర్లపైనే భారం..

Ind vs Aus : ఆస్ట్రేలియా టార్గెట్ 241 రన్స్.. బౌలర్లపైనే భారం..

Ind vs Aus : వన్డే వరల్డ్ కప్ 2023 .. ఫైనల్ సమరం తుది అంకానికి చేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆస్ట్రేలియాకు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌలింగ్ కు అనూకూలించిన పిచ్ పై భారత్ బ్యాటర్లు పరుగులు చేయడానికి చెమటోడ్చారు. భారత్ కు కెప్టెన్ రోహిత్ శర్మ అదరే ఆరంభాన్ని అందించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 47 పరుగులు చేశాడు. గిల్ (4), అయ్యర్ (4) తక్కువ స్కోర్ కే అవుట్ అయ్యారు.


విరాట్ కోహ్లీ (54), కేఎల్ రాహుల్ (66, 107 బంతుల్లో 1 ఫోర్) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.క్రీజులో పాతుకుపోయి సింగిల్స్ తీస్తూ స్కోర్ పెంచే ప్రయత్నం చేశారు. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫీల్డర్లు పాదరసంలా మైదానంలో కదిలారు. పేసర్లు అదరగొట్టారు. స్పిన్నర్లు రాణించారు. ఈ పిచ్ పరుగులు రావడం గగనంగా మారింది. 10 ఓవర్లలోపు 9 ఫోర్లు, సిక్సులు కొట్టిన భారత్ బ్యాటర్లు.. ఆ తర్వాత 16.2 ఓవర్లపాటు బౌండరీ కొట్టలేకపోయారు.

రాహుల్ హాఫ్ సెంచరీ చేసినా అందులో ఒక్క బౌండరీ మాత్రమే ఉంది. 10-40 ఓవర్ల మధ్యలో రెండు ఫోర్లే వచ్చాయి. ఇందులో రాహుల్, సూర్య కుమార్ యాదవ్ చెరో బౌండరీ కొట్టారు. చివరి పది ఓవర్లలోనూ 2 బౌండరీలు మాత్రమే వచ్చాయి. అది కూడా షమీ ఒకటి, సిరాజ్ ఒకటి కొట్టారు. మొత్తంమీద 10 ఓవర్ల తర్వాత భారత్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. అంటే పిచ్ ఎంత కఠినంగా ఉందో అర్థమవుతోంది.


భారత్ 240 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాటర్లలో సూర్య 18 పరుగులు, జడేజా 9, షమీ 6 , బుమ్రా 1, కులదీప్ 10 , సిరాజ్ 9* రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లళో స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్, హేజల్ వుడ్ చెరో రెండు వికెట్లు , మాక్స్ వెల్, జంపా చెరో వికెట్ పడగొట్టారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×