EPAPER

IND-AUS T-20I : కుర్రాళ్లు కొట్టారు.. సిరీస్ పట్టారు!

IND-AUS T-20I : కుర్రాళ్లు కొట్టారు.. సిరీస్ పట్టారు!

IND vs AUS T20 : మొత్తానికి టీమ్ ఇండియా కుర్రాళ్లు రాయ్ పూర్ లో ఆసీస్ తో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ లో విజయం సాధించారు. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ గెలిచారు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లకి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో తడబడిన ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయ దుందుభి మోగించింది.


మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఓపెనర్లు ఇద్దరూ ధాటిగానే ప్రారంభించారు. జైస్వాల్ 6 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 28 బాల్స్ లో 37 పరుగులు చేశాడు. 6వ ఓవర్ ఆఖరి బంతికి అవుట్ అయిపోయాడు. అప్పుడు టీమ్ ఇండియా స్కోరు 1 వికెట్ నష్టానికి 50 పరుగుల మీద ఉంది.

ఫస్ట్ డౌన్ వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి సంగా బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. అప్పటికి స్కోరు 62 పరుగుల మీద ఉంది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో అంతవరకు పటిష్టంగా కనిపించిన టీమ్ ఇండియా స్కోరు 8.1 ఓవర్ లో 3 వికెట్ల నష్టానికి 63 పరుగుల మీద పడుతూ లేస్తూ కనిపించింది. అప్పుడొచ్చాడు రింకూ సింగ్.. 4 ఫోర్లు, 2 సిక్సులతో 29 బాల్స్ లో ధనాధన్ 46 పరుగులు చేశాడు. ఈలోపు రుత్ రాజ్ గైక్వాడ్ (32) అవుట్ అయ్యాడు.


అప్పటికి టీమ్ ఇండియా స్కోర్ 13.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు. తర్వాత ఇషాన్ కిషన్ ప్లేస్ లో వచ్చిన వికెట్ కీపర్ జితేష్ శర్మ ఫటాఫట్ 19 బాల్స్ లో 35 రన్స్ చేసేశాడు. ఎడాపెడా 3 సిక్స్ లు బాదాడు. ఒక ఫోర్ కొట్టి అవుట్ అయ్యాడు. తర్వాత అక్షర్ పటేల్ (0), దీపక్ చాహర్ (0), బిష్ణోయ్ (4) ఇలా వచ్చి అలా అవుట్ అయ్యారు. రింకూ సింగ్ కి సపోర్ట్ ఇచ్చేవారే కరవయ్యారు. చివరికి తను 46 పరుగుల వద్ద 19.1 ఓవర్ లో అవుట్ అయిపోయాడు.

అలా 174 పరుగుల వద్ద టీమ్ ఇండియా ప్రస్థానం ముగిసిపోయింది. ఆసీస్ బౌలింగ్ లో బెన్ 3, జాసన్ 2, ఆరోన్ హార్డీ 1, తన్వీర్ సంగా 2 వికెట్లు తీశారు. తర్వాత 175 పరుగుల ఒక మోస్తరు టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసిస్ అవలీలగా కొట్టేస్తుందని అంతా అనుకున్నారు. కానీ టీమ్ ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్ బ్యాటర్లు ఇబ్బందులు పడ్డారు. త్వరత్వరగా వికెట్లు సమర్పించుకున్నారు.

ఓపెనర్ గా వచ్చిన ట్రావిస్ హెడ్ అప్పటికే దంచి కొడుతున్నాడు. 16 బాల్స్ లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 31 పరుగులు చేశాడు. ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. తర్వాత మరో ఓపెనర్ జోష్ ఫిలిప్పీ (8) త్వరగా అయిపోయాడు. ఇక ఎవరిని కూడా క్రీజులో టీమ్ ఇండియా బౌలర్లు కుదురుకోనివ్వ లేదు. ముఖ్యంగా అక్షర్ పటేల్ కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి తన అద్భుత బౌలింగ్ తో 3 కీలక వికెట్లు తీసుకున్నాడు. తనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

బెన్ మెక్ డెర్మాట్ (19), ఆరోన్ హార్డీ (8), టిమ్ డేవిడ్ (19), మ్యాట్ షార్ట్ (22) ఫర్వాలేదనిపించినా, భారీ భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమయ్యారు. ఇక కెప్టెన్ మాథ్యూ వేడ్ (36) నాటౌట్ గా నిలిచి ఒంటరి పోరాటం చేశాడు. కానీ ఫలితం కనిపించలేదు.

సరిగ్గా ఇక్కడ కూడా 18వ ఓవర్ కి వచ్చేసరికి ఆస్ట్రేలియా విజయం సాధించడానికి 47 పరుగులు కావాల్సి ఉంది. మూడో టీ 20లో చితక్కొట్టినట్టు కొట్టేస్తారని అనుకున్నారు. కానీ ఆవేష్ ఖాన్ జాగ్రత్తగా బౌలింగ్ చేసి మ్యాచ్ ని కాపాడాడు.

18వ ఓవర్ లో 7 పరుగులు ఇచ్చాడు. చివర 20 ఓవర్ లో 10 పరుగులు ఇచ్చి మ్యాచ్ ని గెలిపించడమే కాదు, సిరీస్ వచ్చేలా చేశాడు. ఈ మధ్యలో 19వ ఓవర్ ముఖేష్ వేశాడు. తను 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తానికి ఆస్ట్రేలియాను 154 పరుగులకు కట్టడి చేశారు. 20 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. టీమ్ ఇండియా బౌలింగ్ లో దీపక్ చాహర్ 2, అక్షర్ పటేల్ 3, బిష్ణోయ్ 1, ఆవేష్ ఖాన్ 1 వికెట్లు పడగొట్టారు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×