EPAPER
Kirrak Couples Episode 1

Virat Kohli – Rohit Sharma : కొహ్లీ, రోహిత్ టీ 20 భవిష్యత్ నిర్ణయించేది.. అతనేనా?

Virat Kohli – Rohit Sharma : కొహ్లీ, రోహిత్ టీ 20 భవిష్యత్ నిర్ణయించేది.. అతనేనా?
Virat Kohli-Rohit Sharma

Virat Kohli – Rohit Sharma : ఏదో హడావుడిగా, ఆందోళనగా హంగామా చేస్తూ చీఫ్ సెలక్టర్ అగార్కర్ నేతృత్వంలోని  బీసీసీఐ సెలక్షన్ కమిటీ బ్రందం సౌతాఫ్రికా వెళ్లింది. మళ్లీ తిరిగి వచ్చేసింది కూడా…ఇంకా ఆఫ్గనిస్తాన్ తో జరగాల్సిన టీ 20 సిరీస్ కి జట్టుని ఎంపిక చేయాల్సి ఉంది. కెప్టెన్ ని ప్రకటించాల్సి ఉంటుంది. నాలుగు రోజుల క్రితమే ఎంపిక పూర్తయిందని అంటున్నారు.


ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ కూడా టీ 20లో ఆడేందుకు ఆసక్తి చూపించారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అగార్కర్ బృందం బీసీసీఐ కార్యదర్శి  జై షా అనుమతి కోసం ఆగిందనే వార్తలు రావడంతో నెట్టింట అభిమానులు భగ్గుమంటున్నారు,

మరోవైపు టీ 20 జట్టుని ఎంపిక చేయడం సెలక్షన్ కమిటీకి కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ ఇలా పలువురు వెయిటింగ్ లో ఉన్నారు. వీరిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు.


ఒకవేళ సీనియర్లు ఇద్దరూ ఆడితే, వీరిలో ఎవరిని పక్కన పెట్టాలన్నది పెను సవాల్ గా మారింది. అందుకే అగార్కర్ బ్రందం ఎంపిక చేసిన టీమ్, వాటి వివరాలను బీసీసీఐ ముంగిట పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడు సీనియర్ల భవితవ్యం జైషా చేతిలో ఉందని అంటున్నారు.

ఇంతకీ జైషా ఎవరని అంటే ది గ్రేట్ సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా తనయుడే జైషా…అందుకే ఆయన అంతా తనదేనని, నన్నెవరూ ఏమీ చేయలేరనే ఒక సీన్ క్రియేట్ చేస్తున్నాడని, తనకి నచ్చినట్టు చేసి టీమ్ ఇండియా జట్టు సమతుల్యతను డెబ్బ తీస్తున్నాడనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.  

అంతేకాదు, ఆటమీద, ఆటగాళ్ల మీద వీరి పెత్తనం ఏమిటి? అని క్రికెట్ అభిమానులు దుయ్యబడుతున్నారు. భారతదేశంలో క్రికెట్ ఒక మతం లాంటిది. ఈ విషయంలో అందరూ ఏకమైపోతారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆటపై రాజకీయ నీడ పడటం, వారి కనుసన్నల్లో, వారి అదుపు ఆజ్ణల్లో నడవడం భారత్ క్రికెట్ భవిష్యత్ కి మంచిది కాదని అంటున్నారు.

భారత క్రికెట్ కి ఎంతో గొప్ప సేవ చేసిన ఇద్దరు క్రికెటర్ల భవిష్యత్తును నిర్ణయించేది జైషా నా? అని నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related News

IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

Big Stories

×