EPAPER

Umesh Yadav’s Cryptic Post: పుస్తకాలపై దుమ్ము పడితే.. కథ ముగిసిపోయినట్టు కాదు: ఉమేష్ యాదవ్ఆ క్రోశం!

Umesh Yadav’s Cryptic Post: పుస్తకాలపై దుమ్ము పడితే.. కథ ముగిసిపోయినట్టు కాదు: ఉమేష్ యాదవ్ఆ క్రోశం!
today's sports news

Umesh Yadav’s Cryptic Post Goes Viral in Social Media: విదర్భ ఎక్స్ ప్రెస్‌గా పేరున్న 36 ఏళ్ల ఉమేష్ యాదవ్ ఇంకా తన రిటైర్మెంట్ ప్రకటించలేదు. ఇప్పటికి రంజీ ట్రోఫీలో విదర్భ తరఫున ఆడుతున్నాడు. తాజాగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి జట్టుని గెలిపించాడు. ఇంకా తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇంగ్లాండ్‌తో జరగనున్న మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే అందులో ఉమేష్ యాదవ్ పేరు లేదు.


అంతేకాదు రంజీట్రోఫీల్లో బ్రహ్మాండంగా ఆడుతున్న పుజారా, పృథ్వీ షా పేరుని పరిశీలనలోకి తీసుకోలేదు. మరోవైపు కుర్రాడు తిలక్ వర్మ సెంచరీలు చేసినా చోటు దక్కలేదు. అలా ఫామ్ కోల్పోయిన జట్టుతోనే ప్రయోగాలు చేస్తుంది తప్ప, రంజీల్లో అద్భుతాలు చేస్తున్న సీనియర్లను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఉమేష్ యాదవ్ తన ఆవేదన్ని, ఆక్రోశాన్ని, అసంతృప్తిని ఇన్‌స్టాలో వ్యక్తం చేశాడు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

ఉమేష్ యాదవ్ 2023లో కెన్నింగ్టన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తరఫున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఏడాది గడిచినా టీమ్ ఇండియా నుంచి పిలుపు రాలేదు. ఈ నేపథ్యంలో తను పెట్టిన కొటేషన్ ఏమిటంటే..


Read More: Under-19 World Cup Final: మనోళ్లు గెలుస్తారా? ఫైనల్ సమరం నేడే..

‘పుస్తకాలపై దుమ్ము పట్టినంత మాత్రాన కథ ముగిసిపోయినట్టు కాదు’ అని రాసుకొచ్చాడు. అంతేకాదు టీమ్ ఇండియా తనలాంటి సీనియర్లను విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉమేష్ యాదవ్ 57 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు తీశాడు. 75 వన్డేల్లో 106 వికెట్లు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 12 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ మ్యాచ్‌ల్లో రాణిస్తున్నా తనని పక్కన పెట్టడంపై బీసీసీఐపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే పేయర్లకి వయసే ప్రధాన అడ్డంకి అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఉమేష్‌ని ధైర్యంగా ఉండమని, నిరాశకు లోను కావద్దని కోరుతున్నారు. అవకాశం వస్తుందని, ఆశాభావంతో ఉండమని, ఈ సమయంలో బోర్డుపై తిరుగుబాటు చేస్తే, రావల్సిన బెనిఫిట్స్ రావని, భవిష్యత్తులో టీమ్ ఇండియా మేనేజ్మెంట్‌లో కోచ్‌గా, కామెంటేటర్‌గా భవిష్యత్తులో అవకాశాలు పోతాయని, ఇలా రివర్స్ అవుతుంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా పిలవడానికి భయపడతాయని, జాగ్రత్తగా ఉండమని హితవు పలుకుతున్నారు. 

Tags

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×