EPAPER
Kirrak Couples Episode 1

Sunil Gavaskar :  రిషబ్ పంత్ కే నా ఓటు.. ఎందుకంటే..?

Sunil Gavaskar :  రిషబ్ పంత్ కే నా ఓటు.. ఎందుకంటే..?
Sunil Gavaskar

Sunil Gavaskar : సునీల్ గవాస్కర్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటున్నాడు.  74 ఏళ్ల వయసులో కూడా టీవీ షోల్లో పాల్గొంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇప్పటికి క్రికెట్ కి గుడ్ బై చెప్పి ఆయన 37 ఏళ్లు అవుతోంది. తర్వాత చాలా కాలం కామెంటేటర్ గా పనిచేశాడు. ఇప్పుడదీ మానేశాడు. కానీ సడన్ గా సామాజిక మాధ్యమాల్లో నేనూ ఉన్నానంటూ ఏదొకటి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో  ఒక టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ వికెట్ కీపర్లలో మీ ఓటు ఎవరికి? అని అడిగిన ప్రశ్నకు చాలా విభిన్నంగా  స్పందించాడు.


నిజానికి నా ఓటు రిషబ్ పంత్ కే వేస్తానని గవాస్కర్ బదులిచ్చాడు. నేనేగానీ సెలక్టర్ గా ఉంటే, పంత్ ఫిట్ నెస్ లేకపోయినా సరే, ఒంటికాలితో ఆడగలిగితే చాలు, తననే ఆడిస్తానని తెలిపాడు. ఎందుకంటే తను గేమ్ ఛేంజర్ అని తెలిపాడు. తను క్రీజులో ఉన్నాడంటే , ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్థుడని తెలిపాడు.

ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఆడగల బ్యాటర్ అని తెలిపాడు. తను కీపింగ్ కూడా చేయడం టీమ్ ఇండియాకి అడ్వాంటేజ్ అని తెలిపాడు. మరి కేఎల్ రాహుల్ గురించి ఏమంటారని అడిగితే, పంత్ లేకపోతే మాత్రం నా సెకండ్ ఛాయిస్ కేఎల్ రాహుల్ అని తెలిపాడు.


అదేంటి? మొన్నే కదా 50 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అంత గొప్ప సెంచరీ చేసిన వాడిని చూడలేదని, సౌత్ ఆఫ్రికా టెస్ట్ సెంచరీపై కేఎల్ రాహుల్ ని ఆకాశానికెత్తేశారు, మరి ఇప్పుడేంటి? ఇలా మాట్లాడున్నారని అంటే, ఆ మ్యాచ్ లో ఆ సెంచరీ స్పెషాలిటీ అదీ… అక్కడితో అయిపోయింది. ఇప్పుడు మనం కీపర్ కమ్ బ్యాటర్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండు కలిసిన కాంబినేషన్ లో మాత్రం, నా ఫస్ట్ ఛాయిస్ రిషబ్ పంత్ అని ఖచ్చితంగా చెప్పగలనని అన్నాడు.

అయితే కేఎల్ లో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయని అన్నాడు. ఓపెనింగ్ చేయగలడు, మిడిల్ ఆర్డర్ కూడా ఆడగలడని తెలిపాడు. అయినా సరే, పంత్ తో పోల్చితే రాహుల్ సెకండ్ అని అన్నాడు. తర్వాత ఛాయిస్ జితేష్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ అని తెలిపాడు.

కానీ టీమ్ మేనేజ్మెంట్… ఆఫ్గాన్ తో టీ 20 సిరీస్ కి ఏం చేసిందంటే ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ ని కాదని జితేష్ శర్మ, సంజూ శాంసన్ లను ఎంపిక చేసింది. సునీల్ గవాస్కర్ ఎవరైతే లాస్ట్ ప్రయార్టీస్ అని చెప్పాడో, వారికి ఫస్ట్ ప్రయార్టీ ఇచ్చింది. మనం ఏదైతే ఏం చెబుతామో, దానికి రివర్స్ లో చేయడమే టీమ్ మేనేజ్మెంట్ గొప్పతనమని నెటిజన్లు అప్పుడే కామెంట్లు చేస్తున్నారు.

Related News

IPL 2025: దరిద్రం అంటే ఇదే…మరో100 మంది కెప్టెన్లు వచ్చినా RCB రాత మారదు..?

Telugu Celebrity League: వెండితెర, బుల్లితెర స్టార్స్ తో క్రికెట్ లీగ్.. హైదరాబాదీలకు పండుగే..

IPL 2025: ఐపీఎల్‌ జట్లకు BCCI గుడ్‌ న్యూస్‌..తెరపైకి కొత్త 4+2 రిటెన్షన్ పాల‌సీ…?

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

Big Stories

×