EPAPER

Jacques Kallis : సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవాలంటే ఒకటే మార్గం : కలిస్

Jacques Kallis : సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవాలంటే ఒకటే మార్గం : కలిస్
Jacques Kallis

Jacques Kallis : ఒకప్పుడు విదేశాల్లో ఆడాలంటే…భారత్ ఆటగాళ్లు చాలా  కష్టాలు పడేవారు. కాలక్రమంలో నెమ్మదిగా అక్కడి వాతావరణ పరిస్థితులకి అలవాటు పడ్డారు. అంతేకాదు ఆధునిక శిక్షణలో భాగంగా రాటు దేలారు. విదేశీ కోచ్ లు వచ్చారు. ఆటలో మార్పులు వచ్చాయి. సాంకేతికత పెరిగింది. టెక్నిక్ మెరుగుపడింది. అలా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో ఒకొక్క సిరీస్ లను గెలుస్తున్నారు.


కానీ దశాబ్దాలుగా సౌతాఫ్రికా గడ్డపై మాత్రం గెలవలేక పోతున్నారు. ఇప్పటి వరకు 8 టెస్ట్ సిరీస్ లు జరిగాయి. ఒక్కటి కూడా విజయం సాధించలేదు. అంత గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న ధోనీ కూడా 1-1 తో డ్రా చేసుకుని బయట పడ్డాడు. అదొక్కటే ఉపశమనం తప్ప, మిగిలిన ఏడింట ఇండియా పరాజయం పాలైంది.

ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా ఆల్ రౌండర్ వెటరన్ ప్లేయర్ జాక్వెస్ కలిస్ మాట్లాడుతూ టీమ్ ఇండియా విజయం సాధించాలంటే ఇదొక్కటే మార్గం ఉందని తెలిపాడు. సొంత గడ్డపై, పిచ్ లు వాటి పరిస్థితులు, ఇంకా కిటుకులు , సౌతాఫ్రికా టీమ్ బలహీనతలు చెబుతాడని అనుకుంటే, అంతా తూచ్ అన్నాడు.


ఇంతకీ తను చెప్పిందేమిటంటే… విరాట్ కొహ్లీ ఒక్కడు ఆడితే చాలు…టీమిండియా గెలుస్తుందని చిలకజోస్యం చెప్పాడు. కొహ్లీ క్రీజులోకి వెళ్లాక ఆడకుండా ఎలా ఉంటాడు? కావాలని అవుట్ అవడు కదా…అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కలిస్ ఏమంటున్నాడంటే… తను సీనియర్ కాబట్టి, జూనియర్స్ కి అతని విలువైన సూచనలు ఉపయోగపడతాయి. తను చెప్పినట్టు వాళ్లు ఆడగలిగితే, సౌతాఫ్రికాపై విజయం సాధించడం అంత పెద్ద కష్టమేం కాదని అంటున్నాడు.

కొహ్లీ రాణిస్తే విజయావకశాలు వాటంతటవే వస్తాయని అన్నాడు. ఎందుకంటే సౌతాఫ్రికా గడ్డపై ఆడిన అనుభవం తనకి ఉందని తెలిపాడు. అప్పుడు నేర్చుకున్న పాఠాలని కుర్రాళ్లకి నేర్పిస్తే చాలని తెలిపాడు.

సౌతాఫ్రికాలో టెస్టుల్లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. 14 ఇన్నింగ్స్ ల్లో 719 పరుగులు చేశాడు. అందులో 51.36 సగటుతో ఉన్నాడు. అందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.

మరింతమంది ఆశలు పెట్టుకున్న విరాట్ కొహ్లీ ఏం చేస్తాడో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×