EPAPER
Kirrak Couples Episode 1

ICC World Cup 2023 : పసికూనల పోరు.. నెదర్లాండ్స్‌పై ఆఫ్గాన్ ఘనవిజయం..

ICC World Cup 2023 : పసికూనల పోరు.. నెదర్లాండ్స్‌పై ఆఫ్గాన్ ఘనవిజయం..

ICC World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆడుతున్న చిన్న జట్టు ఆఫ్గానిస్తాన్ పెద్ద టీమ్‌లను ఓడించి టేబుల్ టాప్ 5లోకి వచ్చింది. అంతేకాదు పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసేసింది.


వివరాల్లోకి వెళితే…లఖ్‌నవ్ వేదికగా ఆఫ్గాన్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత ఆఫ్గానిస్తాన్ ఆడుతూ పాడుతూ 31.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయభేరి మోగించింది.

ఈసారి పోటీ పడుతున్నవి.. రెండూ చిన్న జట్లే, అంతేకాదు రెండూ సంచలనాలు నమోదు చేసినవే. నెదర్లాండ్స్ కూడా తక్కువేమీ కాదు.. సౌతాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్‌లో ప్రకంపనాలు సృష్టించింది. అందుకని ఎక్కడో మారుమూల ఒక చిన్న అనుమానం. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆఫ్గనిస్తాన్ విజయం సాధించి టేబుల్ టాప్ 5లోకి వెళ్లింది.


మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. ఏ దశలోనూ గట్టిపోటీనివ్వలేదు. ఆఫ్గాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్లలో బ్రెస్సీ మొదటి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయిపోయాడు. ఇంక అక్కడ నుంచి వికెట్ల పతనం కొనసాగుతూనే పోయింది. మరో ఓపెనర్ మ్యాక్స్ (42) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన అకెర్ మన్ (29) తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. సెకండ్ డౌన్ లో వచ్చిన సైబ్రాండ్ (58) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు.

సరిగ్గా జట్టు స్కోరు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు వద్ద ఉండగా తను రనౌట్ కావడంతో నెదర్లాండ్స్ పతనం వేగవంతమైంది. అలా 179 పరుగుల దగ్గర కథ ముగిసింది.

ఆఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ 1, మహ్మద్ నబీ 3, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు.

తర్వాత ఛేజింగ్‌కు వచ్చిన ఆఫ్గనిస్తాన్ ఓపెనర్లు నిలదొక్కుకోవడానికి ప్రయత్నించారు. ఈ దశలో 5.3 ఓవర్ల దగ్గర గుర్బాజ్ (10) వికెట్ కోల్పోయింది. తర్వాత 10.1 ఓవర్ తర్వాత మరో ఓపెనర్ జడ్రాన్ (20) వికెట్ కోల్పోయింది. అప్పటికి ఆఫ్గాన్ 2 వికెట్ల నష్టానికి
55 పరుగుల మీద ఉంది. ఈ దశలో వచ్చిన రహ్మత్ షా (52), హష్మతుల్లా షాహిది (56 నాటౌట్) అర్థ సెంచరీలు చేయడంతో ఆఫ్గాన్ పటిష్ట స్థితికి వెళ్లింది. లక్ష్యం దిశగా సాగిపోయింది. ఈ దశలో రహ్మత్ షా అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చి అజ్మతుల్లా ఒమర్ జాయ్ (31 నాటౌట్) మరో వికెట్ కోల్పో
కుండా జట్టుని విజయం దిశగా నడిపించాడు.

నెదర్లాండ్స్ బౌలింగ్ లో లోగన్ వాన్ బీక్, వాన్ డెర్ మెర్వె, సాఖిబ్ జుల్ఫికర్ తలా ఒకో వికెట్ తీసుకున్నారు.

ఇప్పుడు పాకిస్తాన్ ఇంకా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మీద ఆడాల్సి ఉంది. ఆఫ్గానిస్తాన్‌ని చూస్తే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మీద ఆడాల్సి ఉంది. అయితే టేబుల్ లో టాప్ 5కి వెళ్లడం వల్ల పాకిస్తాన్ సెమీస్ ఆశలపై ఆఫ్గాన్ నీళ్లు జల్లినట్టేనని, వారిని సంక్లిష్టంలోకి నెట్టీసినట్టేనని చెప్పాలి.

Related News

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Big Stories

×