EPAPER
Kirrak Couples Episode 1

IND vs AUS: వీళ్ళు ప్లేయర్స్ కాదు..గోల్డెన్ డక్స్..మొదటి మ్యాచ్ తోనే విమర్శల పాలవుతున్న భారత్ ఓపెనర్స్

IND vs AUS: వీళ్ళు ప్లేయర్స్ కాదు..గోల్డెన్ డక్స్..మొదటి మ్యాచ్ తోనే విమర్శల పాలవుతున్న భారత్ ఓపెనర్స్

IND vs AUS: టీమిండియా ఆస్ట్రేలియా తో జరిగిన ఆరంభ మ్యాచ్ లోనే అందరికీ షాకుల మీద షాకులు ఇచ్చింది. బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరచడమే కాకుండా 199 పరుగులకే కంగారుకి కళ్ళెం వేశారు. అయితే ఈ ఆనందం గట్టిగా పది నిమిషాలు కూడా నిలబడలేదు. మ్యాచ్ ఆరంభమైన ఒక 20 …30 ఓవర్లకి 199 పరుగులు సునాయాసంగా పూర్తి చేస్తారు అని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అభిమానులకు ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ హై వోల్టేజ్ షాక్ ఇచ్చారు. నిన్న సౌత్ ఆఫ్రికన్ జట్టు వరుస సెంచరీలు తో రికార్డు నెలకొల్పితే…ఈరోజు మన టీమిండియా వరుస డక్ ఔట్ లతో మరొక సరికొత్త రికార్డు నెలకొల్పింది.


ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ డకౌట్‌ ఔట్ అవ్వడంతో ఆదిలోనే హంస పాదం అన్నట్టు…తయారయింది టీం ఇండియా పరిస్థితి. మొదట వన్డే ప్రపంచ కప్ టోర్నీ… ఇప్పటివరకు జరిగిన ప్రతి మ్యాచ్ లో మిగిలిన అన్ని జట్లు ఎంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంటే మనవాళ్లు మాత్రం చెత్త పెర్ఫార్మెన్స్ వదులుకోలేకపోతున్నారు. మ్యాచ్ గెలుస్తామా గెలవమా అనేది పక్కన పెడితే… సీనియర్ ప్లేయర్లు తమ ఆటలో సీరియస్నెస్ చూపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే మ్యాచ్లలో పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది.

గిల్ ప్లేస్ లో ఏదో పొడి చేస్తాడు అని తెగ పొగిడి తీసుకువచ్చిన ఇషాన్ తన మొదటి వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ఆరంభాన్ని గోల్డెన్ డకౌట్ అనే చెత్త రికార్డుతో మొదలుపెట్టాడు.ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ మెరుపు బౌలింగ్ తట్టుకోలేక నాలుగో బంతికే గోల్డెన్ ఎకౌంట్ అయ్యాడు ఈ ఎక్స్ట్రార్డినరీ రీప్లేస్మెంట్ ప్లేయర్.
చాలామంది ఎదురుచూస్తున్న ఒక గోల్డెన్ ఛాన్స్ చేతికి వచ్చిన ఉపయోగించుకోలేక పోయాడు ఇషాన్.శుబ్‌మన్‌ గిల్‌ అస్వస్థత కారణంగా వచ్చిన ఒక్క ఆఫర్ ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఈ వికెట్ కీపర్ కమ్ బాటర్ పై సోషల్ మీడియాలో సెటైర్ల సునామీ మొదలయ్యింది. అంతేకాదు గోల్డెన్ డక్స్ బాయ్ అంటూ ఒక కొత్త బిరుదును ఇచ్చి మీమర్స్‌ తమ వినూత్నమైన మీమ్స్ తో ఇషాన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.


మరోపక్క ముందుండి టీం ను నడిపించాల్సిన కెప్టెన్ మొదటి మ్యాచ్ లోని 0 పరుగులకు వెనుతిరగడం టీం ఇండియాకి మరొక పెద్ద షాక్. ఇషాన్ కిషన్ కంటే ఇది తొలి వన్డే వరల్డ్ కప్…మరి అనుభవం ఉన్న రోహిత్ శర్మ పరిస్థితి ఏమిటి.. ఎన్నో ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళింది.. ఒక టీం కెప్టెన్ అయి 0 పరుగులకు వెనక్కి తిరిగి అతను తన టీం కి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు.. అంటూ నటిజెన్లు రోహిత్ శర్మను సోషల్ మీడియాలో దులిపేస్తున్నారు. మంచి బౌలింగ్ తో 200 కూడా స్కోర్ చేయనివ్వకుండా ఆసీస్ కి అడ్డుకట్ట వేశారు అన్న ఆనందాన్ని అర సెకండ్ కూడా ఉంచలేకపోయావా రోహిత్…అంటూ నిలదీసి హిట్‌మ్యాన్‌ ఆట తీరుపై ఆన్లైన్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఓపెనర్లు నిరాశపరిచిన కింగ్ కోహ్లీ ఎలాగైనా జట్టుని ఆదుకుంటాడు అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related News

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Big Stories

×