EPAPER

T20 World Cup Winners List: టీ 20 ప్రపంచకప్.. ఇంతవరకు ఏం జరిగింది?

T20 World Cup Winners List: టీ 20 ప్రపంచకప్.. ఇంతవరకు ఏం జరిగింది?

List of ICC Men’s T20 World Cup Winners From 2007 to 2022: టీ20 ప్రపంచకప్ 2007లో ప్రారంభమైంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ప్రపంచకప్‌లో మొదటి ఏడాది మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ట్రోఫీ అందుకుంది టీమిండియా. 2014‌లో ఫైనల్ వరకు వెళ్లి శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. దాయాది పాకిస్తాన్‌కి కూడా ఇండియా కన్నా మెరుగైన రికార్డు ఉంది. 2009లో కప్ సాధించిన పాకిస్తాన్ 2017, 2022లో రన్నరప్‌గా నిలిచింది. శ్రీలంక ఒకసారి కప్ గెలిచి రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది.


ఇంగ్లాండ్ 2010, 2022లో కప్ గెలిచింది. 2016లో రన్నరప్ గా నిలిచింది. వెస్టిండీస్ 2012, 2016లో కప్ గెలిచింది. తర్వాత మళ్లీ ఫైనల్ వరకు వెళ్లలేక చతికిలపడింది. 2021లో న్యూజిలాండ్ రన్నరప్ గా నిలిచింది.

ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌ని వెస్టిండీస్, ఇంగ్లాండ్ చెరో రెండు సార్లు గెలిచాయి. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక ఒక్కోసారి గెలిచాయి. ఇప్పటివరకు 8టీ 20 ప్రపంచకప్ పోటీలు జరిగాయి.


పైన పేర్కొన్న రికార్డులన్నీ చూస్తే.. అన్ని ప్రముఖ జట్ల కన్నా మన టీమ్ ఇండియా టీ 20 రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. మనవాళ్లు ఒకసారి గ్రూప్ దశలోంచి వచ్చేస్తే, రెండు సార్లు క్వాలిఫైయింగ్ రౌండు దాటకుండానే వెనుతిరిగి వచ్చేశారు. రెండుసార్లు సెమీస్ లో ఓడిపోయారు. ఒకసారి విజయం సాధించారు. ఒకసారి మాత్రం రన్నరప్ గా నిలిచారు. సవివరంగా మన టీమ్ ఇండియా తీరు తెన్నులను ఒకసారి చూద్దాం.

Also Read: విమానం ఎక్కుతూ.. ఆ రోజు మరిచిపోలేను అన్న విరాట్ కొహ్లీ

2009లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా ఘోర ఫలితాలను చూసింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో రెండో రౌండులో ఇంటిదారి పట్టింది. దీంతో క్రికెట్ లవర్స్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది.

2010లో జరిగిన టోర్నమెంటులో ఇండియా గ్రూప్ దశను దాటింది. సూపర్ 8లో ఆస్ట్రేలియా, ఇండియా, శ్రీలంక, వెస్టిండీస్‌తో కలిసిన గ్రూప్‌లో ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడి ఇండియాకి తిరిగి వచ్చేసింది.

2012లో కూడా సూపర్ 8లోకి వచ్చింది. ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికాతో కలిసిన గ్రూప్ లో ఉంది. కానీ ఇక్కడ 3 మ్యాచ్ లకు 2 మాత్రమే గెలిచి, రన్ రేట్ తక్కువగా ఉండటంతో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ టాప్ లోకి వెళ్లి సెమీస్ లో అడుగుపెట్టాయి. ఇండియా వెనక్కి వచ్చేసింది.

2014లో మాత్రం టీమ్ ఇండియా ఫైనల్ వరకు వెళ్లింది. కాకపోతే శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. చివరకు రన్నరప్‌గా నిలిచింది.

2016లో గ్రూప్ దశను దాటి సూపర్ 10లో అడుగు పెట్టింది. అలాగే అక్కడి నుంచి గ్రూప్ టాపర్ గా వెళ్లి సెమీస్ లో అడుగుపెట్టింది. అక్కడ వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది.

2021లో గ్రూప్ దశను దాటి.. క్వాలిఫైయింగ్ గ్రూప్ లో అడుగుపెట్టింది. అక్కడ 5 మ్యాచ్ లకు 3 మాత్రమే గెలిచింది. పాకిస్తాన్ ఐదంటికి ఐదు గెలిచింది. న్యూజిలాండ్ 4 గెలిచింది. దాంతో అవి రెండూ సెమీస్ కి చేరాయి. ఇండియా ఇంటిముఖం పట్టింది.

Also Read: గంగూలి పోస్టుతో.. నెట్టింట మంటలు

2022లో గ్రూప్ దశను దాటిన టీమ్ ఇండియా క్వాలిఫైయింగ్ గ్రూప్ లో అడుగుపెట్టింది. అక్కడ టేబుల్ టాపర్ గా నిలిచి, సెమీస్ లో అడుగుపెట్టింది. అక్కడ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడి ఇంటిదారి పట్టింది.

ఇదండీ సంగతి.. ఏదో చచ్చీ చెడి గ్రూప్ దశను మాత్రం దాటుతోంది. అక్కడ నుంచి దైవాధీనం సర్వీసు అన్నమాట. రైలు గమ్యస్థానం చేరితే అహా ఒహో అనుకోవాలి.  అందుకని ఎక్కువగా పూనకాలు లోడింగ్ అంటూ ఊగిపోవద్దని నెటిజన్లు అభిమానులను కోరుతున్నారు. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు చరిత్రలో సుఖపడిన దాఖలాలు లేవని రజనీకాంత్ డైలాగ్ ని కోట్ చేస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×