EPAPER
Kirrak Couples Episode 1

T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ నకు ఒమన్ క్వాలిఫై

T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ నకు ఒమన్ క్వాలిఫై
T20 World Cup

T20 World Cup : వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా కలిసి ఆతిథ్యం ఇస్తున్న  టీ 20 వరల్డ్ కప్ వచ్చే సంవత్సరం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో  అర్హత సాధించడానికి ప్రపంచ వ్యాప్తంగా చిన్న జట్లు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా ఆసియా నుండి ఇప్పటికే నేపాల్ జట్టు అర్హత సాధించింది. అంతేకాదు క్వాలిఫయింగ్ మ్యాచ్ లో ఒమన్ జట్టు విజయం సాధించి సంచలనం సృష్టించింది.


తొలి క్వాలిఫయింగ్ సెమీస్ లో బహ్రయిన్ పై 10 వికెట్ల తేడాతో ఒమన్ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బహ్రయిన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. తర్వాత ఛేజింగ్ లో ఒమన్ 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. బౌలర్ అకిబ్ ఇలియాస్ 4 వికెట్లు తీసుకుని విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థులను కట్టడి చేశాడు. ఓపెనర్లు కశ్యప్ ప్రజాపతి (57 నాటౌట్ ) , ప్రతీక్ అథ్ వాలే (50 నాటౌట్) ఇద్దరూ కలిసి విజయతీరాలకు చేర్చారు.

మరో సెమీఫైనల్ లో యూఏఈపై 8 వికెట్ల తేడాతో నేపాల్ నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ  9 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 134 పరుగులు చేసింది. బదులుగా బ్యాటింగ్ కి దిగిన నేపాల్ 17.1 ఓవర్ లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆసిఫ్ షేక్ (64 నాటౌట్), కెప్టెన్ రోహిత్ (34 నాటౌట్) కలిసి మ్యాచ్ ని గెలిపించారు.
పదేళ్ల తర్వాత టీ 20 ప్రపంచకప్ నకు మళ్లీ నేపాల్ అర్హత సాధించడం విశేషం.


ఈసారి ఎప్పుడూ లేని విధంగా టీ 20 వరల్డ్ కప్ 2024లో రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలో దిగాయి. అయితే ఐసీసీ  నేరుగా 12 జట్లకు అర్హత కల్పించింది. ఆతిధ్యం ఇస్తున్న నేపథ్యంలో యూఎస్‌ఏ, వెస్టిండీస్‌ కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభించింది. అలాగే గత టీ 20 వరల్డ్‌కప్‌ లో టాప్‌-8లో నిలిచిన ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌ కూడా నేరుగా అర్హత సాధించాయి.

ఇకపోతే టీ 20 ర్యాంకింగ్స్‌ ప్రకారం  9,10 స్ధానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ కూడా డైరక్ట్‌గా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన 8 బెర్తుల మధ్య పోటీ జరిగింది. అయితే క్వాలిఫయర్స్‌ ద్వారా ఇప్పటికే ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌, కెనడా అర్హత సాధించాయి. తాజాగా నేపాల్‌, ఒమన్ ఈ జాబితాలో చేరాయి. రేపు జరగబోయే టీ 20 వరల్డ్ కప్ లో ఈ దేశాలెన్ని సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే. పెద్ద జట్లకు పారాహుషార్ అని అందరూ సరదాగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Related News

IPL mega auction: ‘రిటెయిన్డ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించాలి’.. ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించిన బిసిసిఐ..

IND VS BAN: బంగ్లాతో టీ20 సిరీస్‍కు టీమిండియా జట్టు ఎంపిక..తెలుగోడికి ఛాన్స్ !

IPL Mega Auction: 5+1 RTM కార్డ్..ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్ ఇవే..ధోనికి రూట్‌ క్లియర్‌!

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Big Stories

×