EPAPER

IPL Franchises: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు.. ఎంత లాభం వస్తుంది?

IPL Franchises: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు.. ఎంత లాభం వస్తుంది?
How much Profit do IPL Franchises Make Per Year: ఐపీఎల్ అంటేనే.. నేటి యువతరం వెర్రెక్కిపోతోంది. అలాంటి ఐపీఎల్ లో ఆడుతున్న పది ఫ్రాంచైజీలు కూడా కోట్ల రూపాయలు తమ జట్లపై ఖర్చుపెడుతూ హోరాహోరీగా పోరాడుతుంటాయి. కొన్ని జట్లయితే ఒకొక్క ఆటగాడిపై రూ.20 – 30 కోట్లపైనే ఖర్చు చేస్తుంటాయి.


కేవలం ఆటగాళ్లు, కోచ్ లు, మెంటార్లు, సహాయక సిబ్బంది, మెడికల్ సిబ్బంది, ఫిజియో థెరపిస్టులు, మసాజ్ చేసేవాళ్లు, ప్రాక్టీస్ బౌలర్లు, బాల్ బోయ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వీరందరికి కలిపి లెక్క తేల్చితే కోట్ల రూపాయల్లో ఖర్చవుతుంది.

అంటే ఉదాహరణకి.. ఒక సీజన్ లో ఒక ఫ్రాంచైజీకి సుమరు రూ.100 కోట్లపైనే ఖర్చవుతుందని క్రికెట్ నిపుణుల అంచనా.. మరి అంత లాభం వారికెలా వస్తుందనే సందేహాలు అందరిలో ఉంటాయి. అయితే ఇదంతా బీసీసీఐకి వచ్చే లాభాలను బట్టే ఉంటాయని చెబుతున్నారు.


ఉదాహరణకి 2024 సీజన్ లో ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి రూ.12 వేల కోట్లు లాభం వస్తే.. అందులో వారికి దాదాపు అన్నింట్లో గీచిగీచి బేరాలు చేసి 20 నుంచి 30 శాతం ముట్టచెబుతుందని అంటున్నారు.  ఇప్పుడు బీసీసీఐకి 2024లో వచ్చిన రూ.12 వేల కోట్లలో నిర్వహణ ఖర్చులు, ప్రైజ్ మనీ, ఇతర ఖర్చులు పోను రూ.8 వేల కోట్లు మిగిలిందని అనుకుందాం.

అందులో 30 శాతం అంటే దాదాపు రూ.2400 కోట్లు ఫ్రాంచైజీలకు ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఐపీఎల్ లో 10 ఫ్రాంచైజీలు ఆడుతున్నాయి కాబట్టి.. ఇలా చూస్తే ఒకొక్క జట్టుకి దాదాపు రూ.240 కోట్లు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఫ్రాంచైజీ రూ.100 కోట్లు ఖర్చు పెడితే , వారికి లాభం రూ.140 కోట్లు ఉంటుంది. అయితే ఆయా ఫ్రాంచైజీలు వాళ్ల ఖర్చులు, వాటి నియంత్రణ బట్టి లాభాలుంటాయనేది అందరికీ తెలిసిన విషయమే.

Also Read: ఐసీసీ పీఠంపై మనోడేనా?: జైషా ఎన్నిక లాంఛమేనా?

అయితే, ఇదంతా కూడా బీసీసీఐకి ఐపీఎల్ ద్వారా వచ్చే ఆదాయంపైనే ఆధారపడి ఉంటుంది. అది తగ్గితే వీరికి షేరింగ్ తగ్గిపోతుంది. ఇక ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే ప్రైజ్ మనీ రూ.40 కోట్లు వస్తుంది, రన్నరప్ కి రూ.20 కోట్లు వస్తుంది. ఇవన్నీ ఫ్రాంచైజీలకు అదనపు ఆదాయాలను ఇస్తాయి.

అయితే ఫ్రాంచైజీలకు ఇవే కాకుండా సొంతంగా కూడా బ్రాండ్ వాల్యూ మీద కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఫ్రాంచైజీ కూడా…ఆ బ్రాండ్ కోసం పోరాడుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీలకు మాత్రమే బ్రాండ్ వాల్యూ ఉంది.

తర్వాత ప్లేస్ లో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ ఇలా వరుసగా ఉన్నాయి.  అందుకే ఐపీఎల్ ట్రోఫీ గెలిచి బ్రాండ్ వాల్యూ పెంచుకోవాలని ఫ్రాంచైజీలు పడరాని పాట్లు పడుతుంటాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×