EPAPER

Maharaja Trophy 2024: మూడు సూపర్ ఓవర్లు.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో హుబ్లీ టైగర్స్ విజయం!

Maharaja Trophy 2024: మూడు సూపర్ ఓవర్లు.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో హుబ్లీ టైగర్స్ విజయం!

Maharaja Trophy 2024: కర్ణాటకలో జరుగుతున్న మహారాజ ట్రోఫీ 2024 క్రికెట్ టోర్ణమెంట్ లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని ఉత్కంఠ పోరుగా మారింది. మ్యాచ్ టై గా ముగియడంతో సూపర్ ఓవర్ వేయడం జరిగింది. అయినా మళ్లీ టై. దాంతో మరో సూపర్ ఓవర్.. అయితే రెండోసారి కూడా టై. దీంతో అంపెర్లు మ్యాచ్ కాసేపు ఆపేశారు. ఆ తరువాత మరో సూపర్ ఓవర్ అనగానే అసలేం జరుగుతోంది అనిపించింది. కానీ మూడో సూపర్ ఓవర్ తో మ్యాచ్ విన్నర్ ని డిక్లేర్ చేశారు. ఈ మ్యాచ్ హుబ్లీ టైగర్స్, బెంగుళూరు బ్లాస్టర్స్ మధ్య బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.


హుబ్లీ టైగర్స్, బెంగుళూరు బ్లాస్టర్స్ మధ్య జరిగిన టి20 మ్యాచ్ చివరి ఓవర్లో మ్యాచ్ గెలవడానికి ఆరు బాల్స్ కు 6 రన్స్ కొట్టాలి. 164 పరుగుల లక్ష్యఛేదన కోసం బెంగుళూరు బ్లాస్టర్స్ తరపున చివరి ఓవర్లో క్రాంతి కుమార్, జ్ఞానేశ్వర్ నవీన్ బ్యాటింగ్ చేస్తున్నారు. హుబ్లీ టైగర్స్ తరపున ఎల్ ఆర్ కుమార్ బౌలింగ్ లో చివరి ఓవర్ తొలి బాల్ కు జ్ఞానేశ్వర్ నవీన్ 4 కొట్టాడు. ఇంకేముంది మ్యాచ్ అయిపోయింది అని అనుకున్నారంతా. అయితే రెండో బాల్ కు జ్ఞానేశ్వర్ నవీన్ అవుట్ అయ్యాడు.

కొత్త బ్యాట్స్ మెన్ లవీశ్ కౌశల్ వచ్చి రెండు డాట్ బాల్స్ ఆడాడు. ఇక మిగిలింది రెండు బాల్స్ కు రెండు రన్స్. అయిదో బాల్ కు ఒక రన్ తీశాడు. దీంతో స్కోర్స్ లెవెల్ అయ్యాయి. అయితే మ్యాచ్ చివరి బాల్ ఆడేందుకు క్రీజ్ లో క్రాంతి కుమార్ వచ్చాడు. గెలవడానికి కావాల్సింది ఒక్క రన్ మాత్రమే. కానీ క్రాంతి కుమార్ లాస్ట్ బాల్ కు ఆ ఒక్క రన్ చేయలేక రన్ అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది.


అప్పుడు మ్యాచ్ తొలి సూపర్ ఓవర్ మొదలైంది. ఎల్ ఆర్ కుమార్ చేతికే సూపర్ ఓవర్ బౌలిండ్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఓవర్లో చివరి బాల్ కు బెంగుళూరు బ్లాస్టర్స్ బ్యాట్స్ మెన్ అనిరుద్ధ జోషి సిక్స్ కొట్టడంతో మొత్తం ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మరోవైపు హుబ్లీ టైగర్స్ బ్యాటింగ్ చేస్తూ.. 11 రన్స్ కొట్టలి. ఈ క్రమంలో మూడు బాల్స్ కు 8 పరుగులు కొట్టాల్సిన అవసరముంది. అప్పుడు హుబ్లీ బ్యాటర్ మనీష్ పాండే సిక్స్ కొట్టాడు. దీంతో చివరి రెండు బాల్స్ లో రెండు పరుగులు కావాలి. మళ్లీ మ్యాచ్ లో టెన్షన్. ఒక బాల్ వేస్ట్ అయింది. ఇక చివరి బాల్ కు పాండే హై షాట్ కొట్టాడు. బాల్ ఆకాశంలో ఉంది. కానీ బెంగుళూరు బ్లాస్టర్ బౌలర్ క్యాచ్ జార విడిచాడు. అయితే పాండే ఒక రన్ మాత్రమే పరిగెత్తాడు. ఇంకేముంది మ్యాచ్ మళ్లీ టై.

రెండో సూపర్ ఓవర్ మొదలైంది. ఈ సారి హుబ్లీ టైగర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. క్రీజ్ లో మనీష్ పాండే, మన్ వంత్ కుమార్ ఉన్నారు. ఈసారి సూపర్ ఓవర్ లో టైగర్స్ వికెట్ కోల్పోకుండా 8 రన్స్ కొట్టారు. దీనికి బెంగుళూరు బ్లాస్టర్స్ జవాబుగా బ్యాటింగ్ చేస్తూ.. వికెట్ కోల్పోయి 8 రన్స్ కొట్టారు. మళ్లీ మ్యాచ్ టై. కాసేపు మ్యాచ్ ఆపేశారు. కానీ మూడో సూపర్ ఓవర్ వేయాల్సిందిగా అంపైర్లు నిర్ణియించారు. మ్యాచ్ చూస్తున్న వారంతా ఏం జరుగుతోంది?’. అని ఆలోచిస్తున్నారు.

Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో

క్రికెట్ చరిత్రలో మూడో సూపర్ ఓవర్ వేయడం ఇదే తొలిసారి. ఈసారి బెంగుళూరు బ్లాస్టర్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ముడో సూపర్ ఓవర్ లో బ్లాసర్స్ టీమ్ 12 రన్స్ కొట్టింది. హుబ్లీ టైగర్స్ బ్యాటింగ్ కోసం మన్ వంత్, మనీష్ పాండే రంగంలోకి దిగారు. ఫస్ట్ బాల్ కు సింగిల్. రెండో బాల్ కు మన్ వంత్ ఒక ఫోర్ కొట్టాడు. అలా చివరి బాల్ కు గెలవడానికి 4 రన్స్ కావాలి. బౌలర్ క్రాంతి ఫుల్ టాస్ బాల్ వేశాడు. దీంతో మన్ వంత్ ఫోర్ కొట్టాడు. అలా చివరికి హుబ్లీ టైగర్స్ విజయం సాధించారు.

Also Read: ఒలింపిక్స్ చాంపియన్లను అవమానించిన ప్రధాని.. మండిపడిన హాకీ లెజెండ్స్!

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×