EPAPER

Rohit Sharma: సర్ఫరాజ్ కోసమే జడేజాను ముందుకు తెచ్చాం: రోహిత్

Rohit Sharma: సర్ఫరాజ్ కోసమే జడేజాను ముందుకు తెచ్చాం: రోహిత్
Rohit Sharma About IND Vs ENG 3rd Test

Rohit Sharma about India Vs England 3rd Test: అత్యంత భారీ తేడాతో టీమ్ ఇండియా రికార్డ్ విజయం సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈసారి మూడో టెస్టులో ఊహించని ఎన్నో ట్విస్టులు జరిగాయని అన్నాడు. వాటన్నిటిని అధిగమించి ఇంత భారీ విజయాన్ని సాధించడం గొప్పగా ఉందని అన్నాడు. టెస్టు క్రికెట్ ఆడుతున్నామంటే రెండుమూడు రోజుల్లో ముగిసిపోదని అన్నాడు.


మొదట ఇంగ్లండ్ బాగా ఆడింది. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టింది. నిజానికి రెండో  రోజు ఆట ముగిసే సమయానికి, రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. మ్యాచ్ చేజారిపోతుందని అనుకున్నాం. కానీ మన బౌలర్లు గొప్పగా ఆడి సత్తాచాటారు. మనవారి బౌలింగ్ పట్ల ఎంతో గర్వంగా ఉందని అన్నాడు.

నిజానికి 33 పరుగులకు 3 వికెట్లు పడిపోయి క్లిష్టదశ నుంచి మొదట బయటపడ్డామని అన్నాడు. అక్కడ దొరికిన పట్టుని ఇంగ్లాండ్ చేజార్చుకుందని తెలిపాడు. అప్పుడు జడేజాని ఐదో స్థానంలో తీసుకురావడం మేలు చేసిందని తెలిపాడు. తనెంతో అనుభవజ్నుడైన ఆటగాడు. అదే సర్ఫరాజ్‌ని ముందుకు తీసుకువస్తే, ఈ ఒత్తిడిలో వికెట్ పారేసుకుంటాడని అనిపించింది.


Read More: 577 టెస్టుల చరిత్ర.. భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం..

అంతేకాదు తను క్లాస్ బ్యాట్స్‌మెన్, అందుకే తనకన్నా ముందు రవీంద్ర జడేజాని తీసుకొచ్చామని తెలిపాడు. ఆ వ్యూహం ఫలించింది. తర్వాత సర్ఫరాజ్ ఎలా ఆడాడో అందరూ చూశామని అన్నాడు.

ఆ తర్వాత మరో క్లిష్టమైన స్థితి అశ్విన్ జట్టులో లేకపోవడమని తెలిపాడు. నిజానికి నలుగురు బౌలర్లతో టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ అంతా నడిపించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని అన్నాడు. అందుకే టీమ్ ఇండియా ఆటగాళ్లందరినీ ముందు ప్రశాంతంగా ఉండమని తెలిపామని అన్నాడు.

ముఖ్యంగా బౌలర్లని ఉద్దేశించి, ఏం టెన్షను పడొద్దు, అంతా సర్దుకుంటుందని టీమ్ మేనేజ్మెంట్ చెప్పడంతో వారు ధైర్యంగా బౌలింగ్ చేసి, ఇంగ్లాండ్‌ని త్వరగా ఆలౌట్ చేశారని అన్నాడు. అన్నింటికన్నా ముఖ్యం టాస్ గెలవడమని అన్నాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్ బ్యాటింగ్‌కి వచ్చేసరికి బాల్ టర్న్ అవుతుందని ముందే ఊహించామని అన్నాడు.

అదే జరిగింది.. ఇంగ్లాండ్ అతి తక్కువ స్కోరుక 122కి ఆల్ అవుట్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. మొత్తానికి టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ అద్భుతంగా ఆడారని కొనియాడాడు. 

Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×