EPAPER

Virat Kohli Son: అందుకే విరాట్ చెప్పలేదా..?

Virat Kohli Son: అందుకే విరాట్ చెప్పలేదా..?

Reasons for Virat Kohli Staying in London: ఎట్టకేలకు విరాట్ కొహ్లీ తనకి అబ్బాయి పుట్టాడని నెట్టింట సంతోషకరమైన వార్త చెప్పాడు. అయితే ఇండియాలో కాకుండా లండన్ ఎందుకు వెళ్లాడని అంతా వెతుకుతుంటే కొన్ని ఆవేదన కలిగించే అంశాలు బయటకు వస్తున్నాయి. అందుకనే తను ప్రపంచానికి దూరంగా, ఎవరికీ తెలియకుండా ఉన్నాడని అంటున్నారు.


విషయం ఏమిటంటే రెండో బిడ్డకి ప్రసవ సమయంలో అనుష్కశర్మకి కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, అందుకే ఇండియాలో కాకుండా లండన్ వెళ్లారని అంటున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్ల సమక్షంలో అనుష్క శర్మ ప్రసవం జరిగిందని, తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో కోహ్లీ ఊపిరి పీల్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

కోహ్లీ-అనుష్క లండన్ వెళ్లిన విషయంపై ఒకరిద్దరు మాట్లాడారు. ఆఖరికి డివిలియర్స్ కూడా ముందు ఒక మాట చెప్పి తర్వాత మాట మార్చాడు.  ఇకపోతే కొహ్లీ వ్యాపార భాగస్వామి హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా ఒక హింట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  


Read More: కోహ్లీ దొరికేశాడ్రోయ్.. నెట్టింట్లో పోస్టు వైరల్..

‘పుట్టబోయే అబ్బాయి క్రికెటర్ అవుతాడా..? లేక సినీ స్టార్ అవుతాడా?’ అంటూ గోయెంకా పోస్ట్ చేసారు. అంతేకాదు మేడిన్ ఇండియా, టు బీ బోర్న్ ఇన్ లండన్ అంటూ ట్యాగ్‌లను జత చేశారు. ఇలా షార్ట్‌కట్‌లు చూసి, చాలామంది రకరకాలుగా అన్వేషించారు.

ఫిబ్రవరి 15న అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అన్నిటికి మించి తమ గోప్యతకు ఇబ్బంది కలిగించవద్దని విజ్ఞప్తి చేశాడు. మరోవైపు ఇక కోహ్లీ-అనుష్క శర్మలు లండన్‌లో స్థిరపడాలనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

క్రికెట్ ఆడటాన్ని తగ్గించాలని, ఇంక ఫ్యామిలికే ప్రాధాన్యత ఇవ్వాలని విరాట్ అనుకుంటున్నాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో ఉంటే,  ఎక్కడికి వెళ్లినా ఇబ్బందే,  అది తమకిష్టం లేదని భావిస్తున్నట్టు సమాచారం.

అందుకే లండన్‌ను సెకండ్ హోమ్‌గా మార్చుకోవాలని అనుకుంటున్నారని, ఇక ఎక్కువ కాలం ఇక్కడ గడపనున్నారని వార్తలు వస్తున్నాయి. బహుశా క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కొహ్లీ శాశ్వతంగా లండన్ వెళ్లిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మరికొందరు జన్మభూమిని వదిలి కొహ్లీ వెళ్లడు, తనకి ఇండియా అంటే చచ్చేటంత ఇష్టమని కొందరంటున్నారు.

ఈరోజు నిర్ణయాలు రేపుండవు, రేపటి నిర్ణయాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలీవు. అన్నీ జరిగినప్పుడు చూద్దాం, ఇప్పుడే అల్లికలెందుకని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×