EPAPER

Vinesh Phogat: వినేశ్ ఫోగట్‌కు గోల్డ్ మెడల్..!

Vinesh Phogat: వినేశ్ ఫోగట్‌కు గోల్డ్ మెడల్..!

Paris Olympics 2024: ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల కేటగిరీలో ఫైనల్స్ వరకు చేరిన భారత మల్లుయోధురాలు వినేశ్ ఫోగట్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. 100 గ్రాములు అధిక బరువు ఉన్నదనే కారణంతో ఆమెపై అనర్హత వేటు వేయడం యావత్ దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఓడినా సిల్వర్ మోడల్ ఖాయంగానే ఉండింది. కానీ, అనర్హత వేటుతో ఏ మెడల్‌ కూడా దక్కని పరిస్థితి. అందుకే ఆమె కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో అప్పీలు దాఖలు చేసింది. తనకు కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్ పై తీర్పు 13వ తేదీన వెలువడనుంది.


ఈ అనూహ్య పరిణామాలు భారతీయుల మనస్సులను చెదరొగట్టాయి. ముఖ్యంగా హర్యానా ప్రజలు ఎక్కువ గాయపడ్డారు. దీంతో ఖాప్ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. పారిస్ నుంచి వినేశ్ ఫోగట్ ఇండియాకు తిరిగి వచ్చినప్పుడు ఆమెకు ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. అలాగే.. పెద్ద సభ ఏర్పాటు చేసి వినేశ్ ఫోగట్‌కు గోల్డ్ మెడల్ అందించాలని ఖాప్ పెద్దలు ఓ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Rumours: ట్రైన్‌లో మంటలు అంటూ ప్రచారం.. బ్రిడ్జీపై నుంచి దూకేసిన ప్రయాణికులు


వినేశ్ ఫోగట్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. ఒలింపిక్స్‌లో మంచి ఆరంభాన్ని ఇచ్చి క్వార్టర్ ఫైనల్‌లో ఘన విజయాన్ని నమోదు చేశారు. సెమీ ఫైనల్‌లో కూడా వరల్డ్ టాప్ ప్లేయర్‌ను ఓడించారు. ఫైనల్‌లో అడుగు పెట్టారు. కానీ, దురదృష్టవశాత్తు ఆమె 100 గ్రాములు అధికంగా బరువు ఉన్నారని ఫైనల్‌లో ఆమెను ఆడనివ్వలేదు. ఆమె అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో వినేశ్ ఫోగట్ ఓడించిన క్రీడాకారిణి ఫైనల్‌లోకి వెళ్లారు. ఈ పరిణామంపై దేశ ప్రజలందరూ కలత చెందారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×