EPAPER

Hardik Pandya: కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది: హార్దిక్ పాండ్యా

Hardik Pandya: కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది: హార్దిక్ పాండ్యా

Hardik Pandya’s Viral Post On ‘Difficult Journey’ Amid T20 WC Captaincy Snub Talks: ఒకవైపు శ్రీలంక టూర్ కి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ తనేమన్నాడంటే కష్టానికి ఫలితం ఎప్పటికైనా లభిస్తుంది. అంతవరకు మనపని మనం చేసుకోవడమే, అని గీతాసారాన్ని సెలవిచ్చాడు.


నిజమే, కానీ ఇప్పుడెందుకు? ఇలా పెట్టాల్సి వచ్చిందని నెటిజన్లు తీవ్ర మేథోమధనం మొదలుపెట్టారు. అందరినీ కాదని అటు వన్డే, ఇటు టీ 20 రెండు ఫార్మాట్లకి పాండ్యానే కెప్టెన్ గా ఉంచారా? అంటున్నారు. మరికొందరు రోహిత్ శర్మ కూడా శ్రీలంక టూర్ కి వస్తున్నాడని అంటున్నారు. అందుకని వన్డేకి రోహిత్, టీ 20కి హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉండమని గానీ ముందుగా బీసీసీఐ ఫోన్ చేసి, చెప్పిందా? అంటున్నారు.

లేదంటే, ఈసారికి రోహిత్ శర్మ వన్డేలకు, సూర్యకుమార్ టీ 20కి కెప్టెన్ గా ఉంటారు. అంతవరకు కూల్ గా ఉండమని చెప్పారా? అందుకే కష్టానికి తగిన ఫలితం ఎప్పటికైనా లభిస్తుంది. అని పోస్టు పెట్టాడా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే హార్దిక్ పాండ్యా పూర్తి పోస్టు సారాంశం ఏమిటంటే.. 2023 వన్డే ప్రపంచకప్ లో గాయం తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నాడు. దాదాపు 5 నెలలు ఆటకి దూరంగా ఉండిపోయాను. ఆ రోజుల్లో చాలా కష్టమనిపించింది. అందుకే టీ 20 ప్రపంచకప్ లో నాశక్తి మేరకు ఆడాలని భావించాను. అలా ప్రపంచకప్ గెలవడం…చాలా ఆనందం అనిపించిందని తెలిపాడు.

Also Read: ఎవరు వెళతారు? శ్రీలంక పర్యటనకు భారత జట్టు ఎంపిక నేడు

ఎన్నో కఠిన పరీక్షలు, ఎంతో కఠోర శ్రమతో మళ్లీ క్రికెట్ ఆడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకే నాకు ఏమనిపిస్తోందంటే.. మన కష్టానికి ఫలితం తప్పకుండా ఏదొక రోజు వస్తుందని అన్నాడు. టీ 20 ప్రపంచకప్ లో మొత్తం  144 పరుగులు చేసిన పాండ్యా, 11 వికెట్లు తీసి ఆల్ రౌండర్ గా అదరగొట్టాడు. ఈ సమయంలో ప్రస్తుతం పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×