EPAPER

Harbhajan Singh: రోహిత్ శర్మ ఐపీఎల్ లో తప్పకుండా ఆడాలి: హర్భజన్ సింగ్

Harbhajan Singh: రోహిత్ శర్మ ఐపీఎల్ లో తప్పకుండా ఆడాలి: హర్భజన్ సింగ్

Rohit Sharma latest newsHarbhajan Singh about Rohit sharma(Sports news headlines): టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఆడాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ముంబై జట్టు కెప్టెన్సీ నుంచి తనని ఎందుకు తప్పించారో తెలియదని తెలిపాడు. బహుశా జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చినట్టు భావిస్తున్నానని అన్నాడు.


ఐదుసార్లు ముంబై ఇండియన్స్ కి ట్రోఫీని రోహిత్ శర్మ అందించాడు. అయితే చెప్పి చేయాల్సింది, అలా సడన్ గా చేయడం సరికాదని అన్నాడు. బహుశా గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించడం వల్ల హార్దిక్ ను తీసుకున్నారని అన్నాడు. జాతీయ జట్టులో ఆటగాడిగా వచ్చి కెప్టెన్ స్థాయికి రోహిత్ శర్మ ఎదిగాడు. అలాగే ముంబై జట్టులో కూడా ఒక ప్లేయర్ గా వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని అన్నాడు.

ధోనీ ఈసారి ఇంపాక్ట్ రూల్ ఉపయోగించి, తన బదులు వేరొకరిని కెప్టెన్ గా తీసుకొచ్చి, మైదానంలో తనకి సలహాలు ఇచ్చి, రెడీ చేస్తాడని అంటున్నారు. బహుశా ధోనీ మొన్న చెప్పబోయే కొత్త వార్త ఇదేనేమో అంటున్నారు. ఏం జరిగినా ధోనీని కెప్టెన్ గా చూసేందుకే ఇష్టపడతాను. నా మైండ్ లో అలా ముద్రపడిపోయిందని హర్భజన్ అన్నాడు.


కొహ్లీ, బాబర్ ఐపీఎల్ లో ఓపెనర్లుగా ఆడితే చూడాలనుంది అని పాక్ అభిమాని ట్వీట్ చేశాడు. అలాగే షాహిన్ ఆఫ్రిది, బూమ్రా కలిసి ముంబై ఇండియన్స్ లో ఆడాలని అన్నాడు. ధోనీ జట్టులో రిజ్వాన్ ఉంటే బాగుంటుందని ఇలా మనసులో కోరికలు బయటపెట్టాడు. దీనికి హర్భజన్ ఘాటుగా స్పందించాడు.

ఇక్కడ భారతీయులెవరికి అలాంటి కలలు లేవు.. మీరు కలలు కనడం ఆపండి.. మేల్కొనండి బాయ్స్ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. మొదటి ఐపీఎల్ లో పాక్ క్రికెటర్లు ఆడారు. కానీ ఇండియాలో లీగ్ మ్యాచ్ లు ఆడవద్దని పాకిస్తాన్ నిషేధం విధించింది. ఆ సంగతి, ఆ కుర్రాడు మరిచిపోయాడని, అందుకే భజ్జీ అలా గట్టిగా ఇచ్చాడని సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×