EPAPER

Harbhajan Singh: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన.. స్పందించిన హర్భజన్‌ సింగ్

Harbhajan Singh: కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన.. స్పందించిన హర్భజన్‌ సింగ్

Harbhajan Singh’s Open Letter To Bengal Government:  కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రెయినీ డాక్టర్‌పై దారుణంగా అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 9న జరిగిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ స్పందించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ లకు లేఖ రాశారు.


కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు. ఈ కేసు విచారణ వేగవంతం చేయాలని, నేరం చేసిన వ్యక్తులకు శిక్ష పడితే బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. ఈ మేరకు రెండు పేజీల లేఖ రాశాడు. ‘ఈ హింస కదిలించింది. ఇది ఒకరికి జరిగిన దాడి మాత్రమే కాదు. దేశంలోని ప్రతి మహిళ గౌరవం, భద్రతపై జరిగిన అతిపెద్ద నేరం.అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.’ అని రాసుకొచ్చారు.

‘వైద్యురాలిపై ఇలాంటి ఘటన జరిగిన తర్వాత మాటలు రావడం లేదు. ఈ ఘటన యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఒక మహిళపై జరిగిన హేయమైన చర్య. దేశంలో ఉన్న మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి ఘటనలపై ఉన్న లోపాలను సరిచేయాలి.’ అంటూ లేఖలో రాశారు.


Also Read: ఆటలపై రాజకీయాలు, సెలక్షన్ పాలసీ.. మనుబాకర్ కోచ్ ఆగ్రహం

‘ఆస్పత్రుల్లో ప్రజల ప్రాణాలను రక్షించే ప్రదేశంలో ఇంతటి ఘోరం జరగడం ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటన జరగడం చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి విషయాల్లో రాజీపడరాదని నేరస్తులను కఠినంగా శిక్షించాలి. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశ వ్యాప్తంగా వైద్యులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న పట్టించుకోవడం లేదు.’ అంటూ మండిపడ్డారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×