EPAPER

Harbhajan Singh Apologize: ‘తప్పు చేశాను.. నన్ను క్షమించండి’.. ఫ్యాన్స్ కు హర్భజన్ సింగ్ విన్నపం!

Harbhajan Singh Apologize: ‘తప్పు చేశాను.. నన్ను క్షమించండి’.. ఫ్యాన్స్ కు హర్భజన్ సింగ్ విన్నపం!

Harbhajan Singh Apologize to Fans on Tauba Tauba Instagram Reel: భారతదేశంపై లేదా టీమ్ ఇండియాపై లేదా, సిక్కు సంప్రదాయాలపై ఎవరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా నేనున్నానంటూ మొదట స్పందించేది హర్భజన్ సింగ్.. అలాంటి తనే నేడు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విషయం ఏమిటంటే వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టైటిల్ నెగ్గిన జోష్‌లో హర్భజన్ సింగ్‌తో పాటు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ వివాదాస్పదమైంది. దీనిపై దివ్యాంగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇంతకీ వారు చేసిన వీడియో ఏమిటంటే, సీనియర్స్ అయిపోవడం వల్ల, 15 రోజులు ప్రాక్టీస్ చేసి చేసి, గ్రౌండులో పరుగులు పెట్టి ఫిట్ నెస్ సమస్యలతో అల్లాడామనే ఉద్దేశంతో సరదాగా కుంటుతూ నడుచుకుంటూ వివిధ రకాల హావభావాలతో ఒక వీడియో చేశారు. దానికి బాలీవుడ్ మూవీ ‘బ్యాడ్ న్యూస్’లోని తౌబా తౌబా హుక్ స్టెప్‌ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేశారు. అంతేకాదు ఈ వీడియోను బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కరణ్‌కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

దేశం మొత్తం హీరోలుగా పరిగణించే వ్యక్తులు ఇంతలా దిగజారుతారా? అని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది. నేషనల్ సెంటరన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అర్మాన్ ఆలీ సీరియస్ అయ్యారు.


Also Read: వింబుల్డన్ విజేతల నైట్ పార్టీ, అల్కరాస్‌తో క్రెజికోవా డ్యాన్స్

ఇది చాలా సిగ్గుచేటు, దివ్యాంగులను ఇలా ఎగతాళి చేస్తారా? అంటూ బీసీసీఐ వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తౌబా.. తౌబా అంటే నొప్పులు, నొప్పులు అని అర్థం వచ్చేలా ఉందని, అందుకే ఆ పాటను ట్యాగ్ చేసి ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు. కొందరు పాజిటివ్ గానే స్పందించారు. వారు పాయింట్ అవుట్ చేసేవరకు మాకు తట్టలేదని కొందరన్నారు.

ఏదేమైనా హర్భజన్ సింగ్ ముందుకు వచ్చి, దేశంలో 1.2 బిలియన్ దివ్యాంగులకు  క్షమాపణలు చెప్పాడు. ఎవరి మనోభావాలను కించపర్చడం తన ఉద్దేశం కాదని తెలిపాడు. సీనియర్లు అయిపోవడంతో, వళ్లు నొప్పులతో అలా అయ్యామని సరదాగా చేసిన వీడియో ఇలా అవుతుందని ఊహించలేదని, తెలియక జరిగిన తప్పునకు మన్నించాలని కోరాడు. అంతేకాదు వెంటనే ఆ వీడియోను ఇన్ స్టా నుంచి డిలీట్ చేశాడు. అలాగే అభిమానులెవ్వరూ దీనిని ఫార్వర్డ్ చేయవద్దని కోరాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×