EPAPER

Robin Minz: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. రోడ్డు ప్రమాదంలో రూ. 3.60 కోట్ల ఆటగాడికి గాయాలు..

Robin Minz: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. రోడ్డు ప్రమాదంలో రూ. 3.60 కోట్ల ఆటగాడికి గాయాలు..

Robin MinzRobin Minz Met With an Accident: ఐపీఎల్ 2024 మినీ వేలంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన క్రికెటర్ రాబిన్ మింజ్ ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. 21 ఏళ్ల ఈ యువకుడిని గుజరాత్ టైటాన్స్ ₹3.60 కోట్లకు కొనుగోలు చేసింది.


తన బ్యాటింగ్ నైపుణ్యానికి పేరుగాంచిన మింజ్.. కవాసాకి సూపర్‌బైక్‌ను నడుపుతుండగా మరో బైక్‌ను ఢీకొట్టి నియంత్రణ కోల్పోయాడు.

ఈ వార్తను ధృవీకరిస్తూ, అతని తండ్రి ఫ్రాన్సిస్ మింజ్, “అతని బైక్ మరొక బైక్‌ను ఢీకొట్టడంతో అతను నియంత్రణ కోల్పోయాడు. ప్రస్తుతం సీరియస్‌గా ఏమీ లేదు. అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు” అని పేర్కొన్నాడు.


ప్రమాదం కారణంగా మింజ్ బైక్ తీవ్రంగా దెబ్బతిందని, ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ కుడి మోకాలికి గాయాలయ్యాయని తెలుస్తోంది.

మింజ్ – భారత మాజీ కెప్టెన్ MS ధోనికి వీరాభిమాని. అనుభవజ్ఞుడైన కోచ్ చంచల్ భట్టాచార్య వద్ద మింజ్ శిక్షణ తీసుకుంటున్నాడు.

మింజ్ ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలోని షిమల్ గ్రామానికి చెందినవాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నుంచి వెలుగులోకి వచ్చాడు.

Read More: కొరియోగ్రాఫర్‌తో క్రికెటర్ భార్య రొమాన్స్, ఫోటో వైరల్

అతను ప్రస్తుతం రాంచీలోని నమ్‌కుమ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఝార్ఖండ్ U19, U25 జట్లలో భాగంగా ఉన్నాడు. అతని తండ్రి – రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది. ప్రస్తుతం అతను రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయంలో గార్డుగా పనిచేస్తున్నారు.

గత ఏడాది డిసెంబరులో, మిన్జ్ రాంచీ విమానాశ్రయంలో MS ధోనిని కలిసినప్పుడు, “ఎవరూ అతనిని ఎంపిక చేయకపోతే, మేము చేస్తాం” అని చెప్పినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

2023 IPL వేలం కోసం మింజ్‌ను ఏ జట్టు ఎంచుకోలేదు, కానీ అతను ఈ ఎడిషన్‌లో రూ. 3.60 కోట్లకు అమ్ముడయ్యాడు. హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసిన తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తరఫున మింజ్ రాబోయే సీజన్‌లో IPL అరంగేట్రం చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ప్రమాద తీవ్రత పెద్దది కాదని అతని తండ్రి చెప్పటంతో గుజరాత్ టైటాన్స్ ఊపిరి పీల్చుకుంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×