EPAPER

Radha Yadav: వరదల్లో చిక్కుకుంటే.. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు

Radha Yadav: వరదల్లో చిక్కుకుంటే.. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు

Gujarat Floods NDRF rescues star Indian cricketer Radha Yadav from Vadodara Floods:  గుజరాత్ లో భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్వామిత్ర నది పోటెత్తడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు నగరాలను ముంచెత్తింది. ఇక వడోదరలో అయితే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లపై వాహనాలు మునిగిపోయాయి. ఈ సమయంలో భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్ కుటుంబం కూడా వరద నీటిలో చిక్కుకుపోయింది.


ఆ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమని కాపాడినట్టు తను సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. మమ్మల్ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ధన్యవాదాలు అని రాధాయాదవ్ తెలిపింది. గుజరాత్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, ఇంకా సైన్యం అంతా కలిసి పడవల మీద వెళ్లి ప్రజలను కాపాడుతున్న ఫొటోలను రాధాయాదవ్ పోస్ట్ చేసింది.

గుజరాత్ లో వరదల కారణంగా ఇప్పటివరకు 28మంది మరణించారు. నాలుగో రోజు కూడా వర్షాలు తగ్గలేదు. ఇప్పటి వరకు 20 వేల మంది వరకు నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ప్రధాని మోదీ మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన సాయాన్ని అందిస్తామని తెలిపారు.


Also Read: రోహిత్ కి రూ.50 కోట్లు ఇచ్చేస్తే.. ఎలా? : గోయెంకా

సౌరాష్ట్రాలోని జామ్ నగర్, పోరు బందర్, దేవభూమి ద్వారక, జామ్ నగర్, అహ్మాదాబాద్ ఇలా పలు ప్రాంతాలు జల దిగ్భందమయ్యాయి. రెస్క్యూ బ్రందాలు రాత్రీ పగలు పనిచేస్తున్నా పరిస్థితులు అదుపులోకి రావడం లేదు.

 ఆగస్టు 30న అరేబియా మహా సముద్రంలో తుఫాను ఏర్పడే సూచనలు ఉండటంతో గుజరాత్ రాష్ట్రం మరింత ఇబ్బందుల్లో పడనుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×