EPAPER

Shubman Gill Fined: చెన్నైపై విజయం.. గిల్‌కు భారీ షాక్.. 25 లక్షల జరిమానా!

Shubman Gill Fined: చెన్నైపై విజయం.. గిల్‌కు భారీ షాక్.. 25 లక్షల జరిమానా!

Shubman Gill Fined for Slow Over Rate: శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్‌కు రూ. 24 లక్షల ఫైన్ విధించింది బీసీసీఐ.


గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్‌కు స్లో ఓవర్ రేట్ కారణంగా ఇదివరకే రూ. 12 లక్షల ఫైన్ విధించింది బీసీసీఐ. చెన్నైతో మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ నమోదు కావడంతో గిల్‌కు రూ. 24 లక్షల ఫైన్ విధించింది. అటు గుజరాత్ ప్లేయింగ్ IX తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా రూ. 6 లక్షల లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (ఏది తక్కువైతే అది) ఫైన్ విధించింది.

“‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు రెండో సారి స్లో ఓవర్ రేట్‌కు సంబంధించి నేరానికి పాల్పడటంతో, గిల్‌కు రూ. 24 లక్షల జరిమానా విధించడం జరిగింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ XIలోని మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి జరిమానా విధించడం జరిగింది. రూ. 6 లక్షలు లేదా వారి సంబంధిత మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది” అని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.


Also Read: Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. రిషబ్ పంత్‌పై సస్పెన్షన్ వేటు..

అటు గిల్‌ రెండు సార్లు చెన్నై జట్టుపైనే స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. అంతకుముందు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 63 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో గిల్‌కు రూ. 12 లక్షలు ఫైన్ విధించింది బీసీసీఐ.

గుజరాత్‌కు ఈ సీజన్‌లో రెండు గేమ్‌లు మిగిలి ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం, మే 13న జరగబోయే మ్యాచ్‌లో గిల్ స్లో ఓవర్ రేట్ నమోదు చేస్తే తదుపరి మ్యాచ్‌కు గుజరాత్ గిల్ లేకుండా ఆడాల్సి ఉంటుంది. చెన్నైపై విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్న గుజరాత్ టైటాన్స్ జాగ్రత్తగా ఆడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: గిల్-సుదర్శన్..సెంచరీలు.. రికార్డుల మీద రికార్డులు

అహ్మదాబాద్ వేదికగా చెన్నైతో తలపడిన మ్యాచ్‌లో గిల్, సుదర్శన్‌లు రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు సెంచరీలు సాధించి టైటాన్స్ విజయానికి పునాది వేశారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×