Big Stories

Dhoni:- అభిమానులకు గుడ్ న్యూస్.. ధోనీ రిటైర్మెంట్ ఇప్పట్లో లేదు…

- Advertisement -

Dhoni:- అభిమానులు సంబరాలు చేసుకునే మంచి మ్యాటర్ ఒకటి చెప్పాడు మహేంద్రసింగ్ ధోనీ. వచ్చే ఐపీఎల్‌లోనూ కచ్చితంగా ఆడతానని కన్ఫార్మ్ చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ వేసేందుకు వచ్చినప్పుడు.. చాలా క్లియర్‌గా ఈ విషయం చెప్పాడు. అభిమానులకే కాదు.. అటు మేనేజ్‌మెంట్‌కు కూడా ఒక్కమాటతో చెప్పినట్టే. తన రిటైర్మెంట్ గురించి ఎవరెవరో ఏదేదో ఊహించుకుంటున్నారు గాని.. తనకు మాత్రం ఇప్పట్లో రిటైర్మెంట్ తీసుకునే ఆలోచనే లేదని చెప్పుకొచ్చాడు. ఈ అనౌన్స్‌మెంట్ అభిమానులను ఖుషీ చేసేదే.

- Advertisement -

ధోనీ వయసు 42. ఈ వయసులోనూ ఆడడం అంటే మాటలు కాదు. అందులోనూ కెప్టెన్సీ చేస్తూ, వికెట్ కీపర్‌గా ప్రతి బాల్‌కు అలర్ట్‌గా ఉండడం నిజంగా గ్రేట్. ధోనీ ఫిట్‌నెస్‌కు నిజంగా హ్యాట్సాఫ్. ధోనీని వచ్చే ఐపీఎల్‌లోనూ ఆడించేందుకు చెన్నై మేనేజ్‌మెంట్ రెడీగా ఉండొచ్చు. అందుకు కారణాలు లేకపోలేదు. నిజంగా ధోనీ జట్టుకు భారంగా మారితే.. అప్పుడు పక్కనపెట్టే ఆలోచన చేసే వాళ్లు. కాని, ఐపీఎల్ టైటిల్ పోరులో ఇప్పటికీ చెన్నై కూడా ఫేవరేటే. అందుకు తగ్గట్టే జట్టు పర్ఫామెన్స్ కూడా ఉంది. గ్రేట్ ఫినిషర్‌గా పేరున్న ధోనీ… ఆఖరి ఓవర్లలో మెరుపు సిక్సులు బాదుతున్నాడు. వికెట్ల వెనక చురుగ్గా కదులుతున్నాడు. ఇప్పటికీ, కెప్టెన్సీలో తిరుగులేదనిపించుకుంటున్నాడు. సో, ధోనీ ఆడకుండా ఉండడానికి ఎలాంటి కారణాలూ కనిపించడం లేదు. తనంతట తాను ఆటకు దూరం అవుదామని నిర్ణయించుకుంటే తప్ప.. చెన్నై జట్టు నుంచి ధోనీని తీసేసే వారే ఉండరు.

ధోనీని 12 కోట్ల రూపాయలతో ఇంకా రిటైన్ చేసుకుంటూనే ఉంటున్నారంటే.. మేనేజ్‌మెంట్ లెక్కలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అటు రవిశాస్త్రి లాంటి వెటరన్స్ కూడా ధోనీలో మరో రెండు మూడు ఐపీఎల్ సీజన్లు ఆడేంత సత్తా ఉందని చెబుతున్నారు. పైగా టెస్ట్ క్రికెట్, వన్డే, ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ.. ఒక్క ఐపీఎల్‌లోనే కంటిన్యూ అవుతున్నాడు. దీన్ని బట్టి ధోని కమిట్‌మెంట్‌ను కూడా అర్థం చేసుకోవచ్చు. ధోనీ రిటైర్ అవ్వొచ్చని అందరూ అనుకోవచ్చు గాని.. చూస్తుంటే తనకు 45 ఏళ్లు వచ్చే వరకు ఆడుతూనే ఉంటాడనిపిస్తోంది. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News