EPAPER

Gautam Gambhir: జడ్డూ, షమీ తప్పక వస్తారు: గౌతంగంభీర్

Gautam Gambhir: జడ్డూ, షమీ తప్పక వస్తారు: గౌతంగంభీర్

Gautam Gambhir clarify Ravindra Jadeja’s and shami ODI exclusion: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతంగంభీర్ తొలిసారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జట్టులోని కీలక ఆటగాళ్లపై తన మనసులో మాట వెల్లడించాడు. ముఖ్యంగా విరాట్ కొహ్లీ విషయంలో నేనేం మాట్లాడతానోనని చాలామంది ఎదురుచూస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుందామని చూస్తున్నారు. మా ఇద్దరి మధ్యా అలాంటిదేమీ లేదు. నేను చాలాసార్లు విరాట్ తో మాట్లాడాను. వాటిని మీ అందరి ముందు రుజువు చేసుకోమంటారా? అని ప్రశ్నించాడు.


తను వరల్డ్ క్లాస్ ప్లేయర్.. తనైనా, నేనైనా దేశం కోసమే ఆడతాం. గేమ్ విషయంలో మా అందరి అభిప్రాయం ఒకటేనని అన్నాడు. ఇక రవీంద్ర జడేజా గురించి మాట్లాడుతూ శ్రీలంక పర్యటన తర్వాత టీమ్ ఇండియా 10 టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. అక్కడ జడ్డూయే కీలకమని అన్నాడు. అది అత్యంత కఠినమైన సవాల్ అని అన్నాడు. అందుకోసమే ఇప్పుడు రవీంద్రకు విశ్రాంతినిచ్చామని అన్నాడు.

బుమ్రా అత్యంత అరుదైన బౌలర్ అని గంభీర్ అన్నాడు. తనని కీలకమైన మ్యాచ్ ల కోసం అట్టే పెట్టుకున్నామని తెలిపాడు. ఒకేసారి తన ఎనర్జీని వాడేస్తే, ఆడాల్సిన మ్యాచ్ లో అలసిపోతాడని తెలిపాడు. కీలకమైన టోర్నమెంట్లు, మ్యాచ్ లకే తనని ఆడిస్తామని అన్నాడు.


Also Read: వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారు: గౌతం గంభీర్

ఇక మహ్మద్ షమీ కూడా తప్పకుండా జట్టులోకి వస్తాడని తెలిపాడు. నేను ఫోన్ చేసి సెప్టెంబరు 19న జరిగే టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండాలని చెప్పాను. తను అన్నట్టుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఎన్సీఏ అధికారులతో కూడా మాట్లాడానని తెలిపాడు. అదే తన గోల్ అని చెప్పాడు.

ఇక రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరికి కూడా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఆధారంగా వారి ఎంపిక ఉంటుందని అన్నాడు. 2027 ప్రపంచకప్ లో వారు ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. మిగిలిన ఆటగాళ్లలో కూడా ఎవరూ శాశ్వతం కాదని అన్నాడు. ఒకరు వెళుతుంటే ఒకరు వస్తుంటారని, టాలెంట్ ఉన్నవాడు మిగులుతాడని ఇదొక నిరంతర ప్రక్రియని అన్నాడు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×