EPAPER

kolkata knight Riders to Team India: టీమ్ ఇండియాలోకి.. కోల్ కతా బ్యాచ్ దిగిపోయింది..

kolkata knight Riders to Team India: టీమ్ ఇండియాలోకి.. కోల్ కతా బ్యాచ్ దిగిపోయింది..

Gautam Gambhir adds more kolkata knight riders to Team India: టీమ్ ఇండియాలోకి కోల్ కతా బ్యాచ్ దిగిపోయింది. అదేనండీ  కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి పలువురు ఆటగాళ్లు ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నారు. హెడ్ కోచ్ గౌతంగంభీర్ తో సహా కోల్ కతా బ్యాచ్ వాడే కావడంతో తనతో పాటు అందరినీ అక్కడ నుంచి దిగుమతి చేసేస్తున్నాడు.


సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ముంబయికి ఆడుతున్నా గతంలో కోల్ కతాకి ఆడినవాడే. అందుకే తనని తీసుకెళ్లి టీ 20 కెప్టెన్ చేశాడని అంటున్నారు. ఇకపోతే కోల్ కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను తీసుకువచ్చి వన్డే జట్టులోకి నెట్టాడు. మరి తనపై బీసీసీఐ నిషేధం ఉంది. అదెలా దాటించేశాడో తెలీదు. ఇక బీసీసీఐ విధించే క్రమశిక్షణకు అర్థం ఏముంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఒక కోచ్ అన్నవాడు అలా చేయడం సరికాదని అంటున్నారు. ఇక రింకూ సింగ్ ఎప్పటినుంచో జట్టులో ఉండనే ఉన్నాడు. తర్వాత బౌలర్ హర్షిత్ రాణాను ఎంపిక చేశాడు. ఇప్పుడు బౌలింగు కోచ్ గా రానున్న మోర్నే మోర్కెల్ కూడా కోల్ కతా టీమ్ లో ఉన్నాడు. వరుసగా ఒకసారి పేర్లు రాసుకుంటే కోల్ కతా టీమ్ నుంచి వచ్చిన వారిలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రింకూసింగ్, హర్షిత్ రాణా, మోర్నే మోర్కెల్, తనతో కలిపి మొత్తం ఆరుగురున్నారు.


రాబోవు రోజుల్లో ఇంకెంత మంది అక్కడ నుంచి వస్తారో తెలీదని అంటున్నారు. అయితే మొండివైఖరితో తన పంతం నెగ్గించుకున్న గౌతం గంభీర్ కి రేపేమైనా తేడాపాడా వస్తే బీసీసీఐ తాట తీసేస్తుందని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. మనిషికి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని, అంతా తనమీద వేసేసుకోవడం తెలివైన వాడి లక్షణం కాదని అంటున్నారు.

Also Read: ఇండియా ఆడకపోతే క్రికెట్ అంతమైపోదు .. ఛాంపియన్స్ ట్రోఫీపై పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ వ్యాఖ్యలు

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. కొన్ని దశాబ్దాల నుంచి మన క్రికెటర్లు ఆడే మ్యాచ్ లను చూస్తూ పెరిగిన సీనియర్ అభిమానులు ఏమంటున్నారంటే, టీమ్ ఇండియా ఆటగాళ్లు ఎప్పుడెలా ఆడతారో ఎవరికీ తెలీదు. వాళ్లని మరీ గుడ్డిగా నమ్మవద్దని గంభీర్ కు హితవు పలుకుతున్నారు.

మన పేపరు పులులపై ఎక్కువ ఆశలు పెట్టుకుని బీసీసీఐకి అడ్డదిడ్డమైన హామీలన్నీ ఇవ్వవద్దని, మూర్ఖత్వాన్ని వదిలి, వారు చెప్పినవి కూడా కొన్ని చేయమని చెబుతున్నారు. అప్పుడు తిలాపాపం తలా పిడికెడు కింద అవుతుందని, వారు కిమ్మనకుండా ఉంటారని సలహాలిస్తున్నారు. లేదంటే నీమీద పడిపోతారని చెబుతున్నారు. మరి గౌతం గంభీర్ కి ఈ జీవిత సత్యం ఎప్పుడు బోధపడుతుందో ఏమిటో అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×