IPL 2025 Retentions: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వచ్చేస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ 2025 రిటైన్షన్ లిస్ట్ ను ( IPL 2025 Retentions) వదిలారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించాయి. చాలా జట్లు తమ కోర్ ప్లేయర్స్ ను అట్టి పెట్టుకోవడానికి మొగ్గు చూపాయి. అయితే అన్ని టీమ్ లు రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను ప్రకటిస్తే ప్రతి టీం కూడా ఇంగ్లాండ్ ప్లేయర్స్ ను ( England players) రిలీజ్ చేసేశాయి. దీని వెనక ఓ పెద్ద కారణమే ఉందంట.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్ ఇదే !
Also Read: IPL 2025 Retention: ప్రీతిజింటా ప్లాన్ అదుర్స్..పంజాబ్ లోకి ముగ్గురు కెప్టెన్స్ ?
అదేంటంటే గత సంవత్సరం వరకు ఐపీఎల్ మ్యాచ్ లు… మొదలైతే ఇంగ్లాండు ప్లేయర్లు ( England players) ఎప్పుడు వచ్చి ఆట ఆడుతారు ? ఎప్పుడు స్వదేశానికి వెళ్ళిపోతారు ? అనేది ఎవరికి అర్థం కాదు. చివరి సీజన్ లో చూసినట్లయితే రాజస్థాన్ కీలక బ్యాటర్ అయిన జోస్ బట్లర్ ( Jos Buttler ) లీగ్ కఠినమైన పరిస్థితులలో జట్టును వదిలి వెళ్ళిపోయాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న శ్యామ్ కరణ్ కూడా అలానే చేశాడు. నాయకుడిగా ముందుండి జట్టును నడిపించాల్సిన వ్యక్తి అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్ళిపోయాడు.
Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
ఇక బెన్ స్టోక్స్ ని ( Ben Stokes ) నమ్ముకున్న చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) గట్టి దెబ్బను ఎదుర్కొంది. అతడిని 2023లో ఆ క్షణంలో 16 కోట్ల 25 లక్షల పెట్టి కొనుగోలు చేశారు. కానీ బెన్ స్టోక్స్ ( Ben Stokes ) 2023లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి గాయాలు అయ్యాయని తన సదేశానికి వెళ్ళిపోయాడు. ఇక 2024లో వర్క్ లోడ్ సాకు చెప్పి అసలు సీజన్ కి కూడా రాలేకపోయాడు. ఇక ఇతని వల్ల చెన్నైకి భారీ నష్టమే వాటిల్లింది.
Also Read: IPL 2025 Retention: రింకూకు 2000 శాతం రేట్..ఐపీఎల్ లో ఈ ప్లేయర్లకు పంట పడింది !
ఆర్సిబిలో సెంచరీ బాధిన మిల్ జాక్స్, పంజాబ్ కీలక బ్యాటర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీరందరూ ఐపిఎల్ మ్యాచ్ లకు కాంట్రాక్ట్ ఒప్పుకొని సీజన్ మధ్యలో వెళ్లిపోవడం చాలా తప్పు. ఇలాంటి వారిని తీసుకొని ఐపీఎల్ టీమ్ ఫ్రాంచైజీలు చాలానే నష్టపోయాయి. ఇలా భారీగా నష్టపోయి అలాంటి ఆటగాళ్లతో విసిగిపోయిన టీమ్ లు ఎవ్వరూ కూడా ఇంగ్లాండ్ ప్లేయర్లను ( England players) అసలు తీసుకోలేదు. మరి ఇంగ్లాండ్ ప్లేయర్లను యాక్షన్ లోనైనా కొనుక్కుంటారేమో చూడాలి. కాగా ఇప్పటికే.. పాకిస్థాన్ ప్లేయర్లపై ఐపీఎల్ బ్యాన్ వేసిన సంగతి తెలిసిందే.