EPAPER

Neeraj Chopra: నీరజ్ చోప్రాని ఫోన్ నెంబర్ అడిగిన అమ్మాయి.. ఏం చేశాడో తెలుసా?

Neeraj Chopra: నీరజ్ చోప్రాని ఫోన్ నెంబర్ అడిగిన అమ్మాయి.. ఏం చేశాడో తెలుసా?

Fan asks Neeraj Chopra for His Phone Number: సెలబ్రిటీలు అవడం ఎంత కష్టమో.. అక్కడ నిలుచోవడం అంతే కష్టం. ముఖ్యంగా ప్రైవసీ ఉండదు. ఎప్పుడూ దాక్కుని దాక్కుని వెళ్లాలి. లేదంటే విదేశాలకు పారిపోవాలి. అక్కడ ప్రశాంతంగా ఉండాలి. అంతేకానీ మన దేశంలో తిరిగితే ఇకంతే సంగతి.


ఇప్పుడు విరాట్ కొహ్లీ కూడా అదే రీతిలో భారతదేశంలో ఉంటే తన ప్రైవేసీకి భంగం కలుగుతోందని లండన్ వెళ్లి సెటిల్ అవాలని అనుకుంటున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే… ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ వరుసగా నీరజ్ చోప్రాకి అమ్మాయిల ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఉంది. అయితే అది మనదేశంలో కాదు.. విదేశాల్లో అధికంగా ఉంది. ఇక అమ్మాయిలైతే ఆటోగ్రాఫ్ లే కాదు.. ఫోన్ నంబర్లు కూడా అడగడంతో ఒక్కసారి ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బెల్జియంలోని బ్రస్సెల్ లో ఇటీవల జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ సందర్భంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఈ లీగ్ ఫైనల్ లో నీరజ్ ఎప్పటిలా రెండో స్థానంలో నిలుచున్నాడు. జస్ట్ ఒక్క సెంటిమీటర్ తక్కువ దూరం విసరడంతో నెంబర్ వన్ ప్లేస్ కోల్పోయాడు. తను 87.86 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. కానీ తనకన్నా బెటర్ గా గ్రెనడాకు చెందిన పీటర్స్ అండర్సన్ 87.87 మీటర్లు విసిరి ఛాంపియన్ గా నిలిచాడు.


Also Read: 9 వికెట్లతో అదరగొట్టిన అర్జున్ టెండుల్కర్

ఇక్కడే అమ్మాయిలు వచ్చి వరుసగా ఆటోగ్రాఫ్ లు అడిగారు. అందరికీ ఇచ్చుకుంటూ వెళ్లాడు. చాలామంది అమ్మాయిలు ఫొటోలు కూడా తీసుకున్నారు. అందులో ఒకమ్మాయి మాత్రం ఫోన్ నంబర్ అడిగితే, సున్నితంగా తిరస్కరిస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

అయితే నీరజ్ చోప్రా ఆటతీరులో పెద్ద మార్పు రావడం లేదు. రజతం దగ్గరే ఆగిపోతున్నాడు. గతేడాది జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్స్ లో కూడా నీరజ్ చోప్రా రెండో స్థానమే దక్కించుకున్నాడు. ఇక పారిస్ ఒలింపిక్స్ లో కూడా నీరజ్ రెండో స్థానంలోనే నిలుచున్నాడు.

26 ఏళ్ల నీరజ్ చోప్రాకి బహుశా వయసు అయిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఇంకా తనకి వయసు ఉందని కొందరు జవాబిస్తున్నారు. 2028 లాస్ యాంజిల్స్ లో జరిగే ఒలింపిక్స్ నాటికి నీరజ్…30 ఏళ్లకు వచ్చేస్తాడు. నిజానికి కుర్రాడిగా ఉన్నప్పుడు అంటే 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా.. 2024కి వచ్చేసరికి రజతంలోకి పడిపోయాడు. అందువల్ల వచ్చే ఒలింపిక్స్ నాటికి శక్తి ని పుంజుకుని, మరింత ప్రాక్టీస్ చేసి తిరిగి స్వర్ణం సాధించాలని అభిమానులు కోరుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×