EPAPER

Praveen Kumar Comments on Hardik Pandya: డబ్బుల కోసం కాదు.. దేశం కోసం ఆడాలి.. పాండ్యాపై మాజీ బౌలర్ ప్రవీణ్!

Praveen Kumar Comments on Hardik Pandya: డబ్బుల కోసం కాదు.. దేశం కోసం ఆడాలి.. పాండ్యాపై మాజీ బౌలర్ ప్రవీణ్!

praveen kumar


Praveen Kumar slams Hardik Pandya Ahead of IPL 2024: ముంబై ఇండియన్స్ జట్టు ఏ ముహూర్తాన హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుని కెప్టెన్ ని చేసిందో అప్పటి నుంచి వివాదాలు ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాయి. ఒకవైపు నుంచి ఫ్రాంచైజీకి మనశ్శాంతి ఉండటం లేదు, ఇటు హార్దిక్ పాండ్యా కూడా నలిగిపోతున్నాడు.
ఆ క్షణం పాండ్యా అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు.. ఇప్పుడు వెనక్కి వెళ్లలేడు. ఏం జరిగితే అదే జరిగిందని ముందుకే వెళ్లాలి. ఈ క్రషింగ్ సమయంలో మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ కొన్ని బౌన్సర్లు హార్దిక్ పాండ్యాపై వేయడంతో నెట్టింట వైరల్ గా మారింది.
ఇంతకుముందు ముంబై ఇండియన్స్, ఆర్సీబీ, పంజాబ్ జట్లకు ప్రవీణ్ ప్రాతినిధ్యం వహించాడు. తనేమంటాడంటే ముందు ఏ క్రికెటర్ అయినా సరే, దేశం కోసం ఆడాలి, తర్వాత రాష్ట్రం కోసం ఆడాలి.. ఆ తర్వాతే డబ్బుల కోసం ఐపీఎల్ లాంటివి ఆడాలి. ఇప్పుడున్న క్రికెటర్లు దేశం కోసం కాకుండా డబ్బులొచ్చే ఐపీఎల్ కోసం ఆడుతున్నారు. అందుకోసం జాతీయ జట్టులో స్థానాన్ని కూడా వదిలిపెడుతున్నారని అన్నాడు.

Also Read: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ..

ఇలా అంటూనే హార్దిక్ పాండ్యా విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ విషయంలో ముంబయి ఇండియన్స్ తొందరపాటు నిర్ణయం తీసుకుందా? అని ప్రశ్నించాడు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా నియమించడం సరైందేనా? అని అన్నాడు.


పాండ్యా మరి ఐపీఎల్ కి ఫిట్ గా ఉంటే, మరి రెండు నెలలుగా జాతీయ జట్టుకి ఎందుకు ఆడలేదు, ఇటు రాష్ట్ర జట్టుకి ఎందుకు ఆడలేదు…కానీ ఐపీఎల్ కి మాత్రం వచ్చేశాడు అని విమర్శించాడు. డబ్బులు సంపాదించండి తప్పు లేదు, కానీ జాతీయ జట్టులో కాదని ఇలా ఆడి సంపాదించడం మాత్రం సరికాదని అన్నాడు.  దేశం కోసం ఆడటాన్ని గర్వంగా ఫీలవ్వాలని తెలిపాడు.

ఐపీఎల్ ఆడటం కోసం నెలరోజులుగా రెస్ట్ తీసుకుని, మంచి ఫిట్ గా, మెంటల్ స్ట్రెంగ్త్ తో వస్తున్నారు. అదే జాతీయ జట్టుకి ఆడమంటే మాత్రం మోకాలి నొప్పి, వెన్నునొప్పి అని సాకులు చెబుతున్నారని విమర్శించాడు. అలాగని నా ఉద్దేశం ఫ్రాంచైజీ క్రికెట్ ని వదిలేయమని కాదని అన్నాడు.

Also Read: Virat Kohli in T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీకి చోటు దక్కుతుందా..? IPL ప్రదర్శనే కీలకమా..?

ముంబై ఇండియన్స్ మాత్రం కెప్టెన్ మార్పు విషయంలో తొందరపడిందని అన్నాడు. మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ 2024కి ప్రవీణ్ కుమార్ ఇలా స్వాగతం చెప్పాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×