EPAPER

England Vs South Africa: ఇంగ్లాండ్ చిత్తు.. సౌత్ ఆఫ్రికా గెలుపు..

England Vs South Africa: ఇంగ్లాండ్ చిత్తు.. సౌత్ ఆఫ్రికా గెలుపు..

England Vs South Africa: ఇంగ్లండ్ బ్యాట్ మెన్స్ ఆట చూస్తే… మా ఆవిడ ఫోన్ చేసింది… ఇంటి దగ్గర అర్జెంటు పనుంది, వెంటనే వెళ్లాలన్నట్టు ఆడారని నెట్టింట అప్పుడే సెటైర్లు పేలుతున్నాయి.


వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ముంబయిలో జరుగుతున్న ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్ ఏకపక్షంగా సాగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. లక్ష్య చేధనలో ఇంగ్లండ్ పరుగులు తీయలేక 170 పరుగులకి చతికిలపడిపోయింది. 229 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

ఇక్కడ అదృష్టమో, దురదృష్టమో తెలీదు కానీ టాస్ గెలిచి మరీ ఇంగ్లండ్ ఇంత ఘోరంగా ఓటమి పాలవడం విడ్డూరంగానే ఉందని అంటున్నారు. పిచ్ ని పరిశీలించడం రాలేదా? లేక టార్గెట్ పెరిగిపోయేసరికి చేతులెత్తేశారా? అన్నది అర్థం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్ కి వచ్చిన దక్షిణాఫ్రికా మొదట కంట్రోల్ గానే ఆడారు. అప్పటికే వాళ్లు నెదర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో ఓటమి పాలై పరువు పోగొట్టుకుని ఉన్నారు. దీంతో మళ్లీ పరువు పోగొట్టుకోవద్దనే రీతిలోనే ఆటని ప్రారంభించారు.


అయితే మొదట్లోనే డీకాక్ (4) వికెట్ కోల్పోయింది. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన డస్సేన్ తో కలిసి మరో ఓపెనర్ హెన్రిక్ ఆటని ముందుకు తీసుకువెళ్లాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రషీద్ విడగొట్టాడు. అప్పటికి రెండు వికెట్ల నష్టానికి 125 పరుగుల మీద దక్షిణాఫ్రికా ఉంది. తర్వాత సెకండ్ డౌన్ లో వచ్చిన మార్ క్రమ్ (42) టోప్లే బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. అప్పుడు వచ్చాడండీ క్లాసేన్. తను వచ్చీ రావడమే ఎడాపెడా అందరికీ ఇస్తినమ్మా వాయనం…పుచ్చుకుంటినమ్మా వాయనం అంటూ వడ్డించుకుంటూ వెళ్లిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంను హోరెత్తించాడు. ఎలాంటి బాల్ పడినా సరే, గ్రౌండ్ అవతల పడాల్సిందే అన్నట్టు ఆడాడు అనడంకన్నా ఎడా పెడా బాదేసాడనే చెప్పాలి. 67 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. తర్వాత హెన్రిక్ (85), డస్సేన్ (60) ఇలా అందరూ తమ శక్తివంచన లేకుండా ఇంగ్లండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు.

జాన్సేన్ అయితే 42 బాల్స్ లో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 7 వికెట్ల నష్టానికి దక్షిణాఫ్రికా 399 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లే 3 వికెట్లు తీశాడు. ఆట్కిన్ సన్, రషీద్ రెండేసి వికెట్లు తీశారు.

ఛేజింగ్ కి వచ్చిన ఇంగ్లండ్ ఎక్కడ కూడా పోరాట పటిమ చూపలేదు. ఇది మనవల్ల కాదు…ఎందుకంత కష్టపడటం అన్నట్టే ఆడారు. మొదటి బాల్ నుంచే గాల్లోకి లేపడం మొదలుపెట్టారు. ఎంత అర్జెంట్ గా ఇంటికి వెళ్లిపోదామా? అన్నట్టే ఆడారు. ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతూనే ఉన్నారు. ఒక దశలో 68 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ ప్రవాహం ఆగలేదు. 15.1 ఓవర్ లో 84 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి విలవిల్లాడారు.
హ్యారీ బ్రూక్ (17), బట్లర్ (15) బెయిర్ స్టో(10) ఇలా ఉన్నాయి…
టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చేసిన పరుగులు…

ఈ పరిస్థితుల్లో 20 ఓవర్లలో చాప చుట్టేస్తుందనే భ్రాంతి కలిగించారు. అయితే చివర్లో మార్క్ వుడ్ 17 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఒక బౌలర్ అయి ఉండి, ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ తలవంచుకునేలా చేశాడు. తను అంత ఈజీగా కొడుతుంటే వీరు దద్దమ్మలా వచ్చేశారని నిరూపించాడు. తర్వాత మరో బౌలర్ ఆట్కిన్సన్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇలా వీరిద్దరి దయ వల్ల ఇంగ్లండు 170 పరుగులు చేయగలిగింది. గాయపడిన టోప్లే బ్యాటింగ్ కి రాలేదు.

ఈ మ్యాచ్ దెబ్బకి పాయింట్ల పట్టికలో 2019 డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లండ్ 9వ స్థానానికి పడిపోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్ పై దక్షిణాఫ్రికా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×