EPAPER

England Vs New Zealand : ఒక్క పరుగు తేడాతో విజయం.. ఇంగ్లాండ్ కు న్యూజిలాండ్ షాక్..

England Vs New Zealand : ఒక్క పరుగు తేడాతో విజయం.. ఇంగ్లాండ్ కు న్యూజిలాండ్ షాక్..

England Vs New Zealand : ఫాలో ఆన్ లో పడినా మ్యాచ్ పై పట్టు సాధించింది. ప్రత్యర్థి విజయానికి చేరువైనా పోరాటం చేసింది. చివరికి సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్ తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కేవలం ఒకే పరుగు తేడాతో గెలిచి సంచలనం సృష్టించింది. ఆద్యంతం ఈ మ్యాచ్ అనేక మలుపులు తిరిగింది. చివరిరోజు అనూహ్యంగా న్యూజిలాండ్ పుంజుకుని మ్యాచ్ పై పట్టు సాధించింది. విజయం రెండు జట్లను ఊరించినా..చివరకు కివీస్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది.


అనేక ములుపులు
258 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ ఒక దశంలో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇక కివీస్ ఈ మ్యాచ్ లో సులభంగానే గెలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ పుంజుకుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్, జో రూట్ జట్టు స్కోర్ ను 200 పరుగులు దాటించారు. కానీ ఇక్కడే మ్యాచ్ మరో టర్న్ తీసుకుంది. ఒక్క పరుగు తేడాలో స్టోక్స్ (33), రూట్ ( 95) అవుట్ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే బ్రాడ్ (11) పెవిలియన్ కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ 215 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. కివీస్ గెలవాలంటే రెండు వికెట్లు తీయాలి. ఇంగ్లాండ్ గెలుపు కోసం 43 పరుగులు కావాలి. కివీస్ ఇక గెలిచినట్లే అని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ కీపర్ ఫోక్స్ ( 35) అద్భుతంగా పోరాటం చేసి జట్టు స్కోరును 250 పరుగులు దాటించాడు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో ఫోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ పై ఉత్కంఠ మరింత పెరిగింది. మరో 5 పరుగుల తర్వాత అండర్సన్ అవుట్ కావడంతో ఇంగ్లాండ్ కథ ముగిసింది. కివీస్ జట్టు సంబరాల్లో తెలిపోయింది. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ 4, సౌథీ 3, హెన్రీ రెండు వికెట్లు పడగొట్టారు.

హ్యారీ బ్రూక్ 186, జో రూట్ 153 నాటౌట్ భారీ శతకాలు బాదడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్కోర్ 435/8 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ జట్టు కుప్పకూలింది. కేవలం 209 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ టీమ్ సౌథీ ( 73) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 226 పరుగులు వెనుకబడిన కివీస్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిల్యాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. కేన్ విలియమ్సన్ (132) సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు కొట్టారు. ఓపెనర్లు లాథమ్ ( 83), కాన్వే ( 61) గట్టిపునాది వేశారు. అలాగే టామ్ బండెల్ ( 90) , మిచెల్ (54) రాణించారు. కివీస్ రెండో ఇన్నింగ్స్ లో 483 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 257 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 256 పరుగులకు ఆలౌట్ కావడంతో కివీస్ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను సమం చేసింది. తొలి టెస్టు ఇంగ్లాండ్ సునాయాసంగా కివీస్ పై గెలిచింది.


ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేన్ విలియమ్సన్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ హ్యారీ బ్రూక్

మూడో జట్టు కివీస్..
ఫాలో ఆన్‌లో పడిన జట్టు గెలవడం టెస్టు క్రికెట్‌లో చాలా అరుదు. ఇలా ఇప్పటి వరకు ఇంగ్లాండ్ , భారత్ జట్ల మాత్రమే ఫోలో ఆన్ ఆడి గెలిచాయి. ఇంగ్లాండ్‌ 1894, 1981లో ఆసీస్‌పై ఇలానే గెలిచింది. టీమిండియా 2001లో ఆస్ట్రేలియాపై ఫాలో ఆన్ ఆడి చారిత్రాత్మక విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించినా మూడుసార్లు ఆసీస్ ఓడిపోయింది. ఇప్పుడు ఆ జాబితాలో రెండో జట్టుగా ఇంగ్లాండ్ చేరింది.

కివీస్ వరల్డ్ రికార్డు..
1993లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. 30 ఏళ్ల తర్వాత ఆ రికార్డును కివీస్‌ సమం చేసింది. గతంలో న్యూజిలాండ్ ఉత్కంఠ పోరులో రెండుసార్లు ఇలాగే టెస్టు మ్యాచ్ లో గెలిచింది. 2018లో పాకిస్తాన్‌పై 4 పరుగుల తేడాతో, 2011లో ఆస్ట్రేలియాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టెస్టు క్రికెట్‌లో అతి తక్కువ తేడాతో సాధించిన విజయాలు ఇవే..
1993లో ఆస్ట్రేలియాపై ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్‌ విక్టరీ
2023లో ఇంగ్లాండ్‌పై ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్‌ విజయం
2005లో ఆస్ట్రేలియాపై 2 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ విక్టరీ
1902లో ఇంగ్లాండ్‌పై 3 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
1982లో ఆస్ట్రేలియాపై 3 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపు
2018లో పాకిస్తాన్‌పై 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విక్టరీ
1994లో ఆస్ట్రేలియాపై 5 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
1885లో ఇంగ్లాండ్‌పై 6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపు

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×