EPAPER

England vs New Zealand: విధ్వంసకర సెంచరీలతో ఇంగ్లాండు పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్…

England vs New Zealand: విధ్వంసకర సెంచరీలతో ఇంగ్లాండు పై ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్…

England vs New Zealand: గత వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో అపజయాని రుచి చూసిన న్యూజిలాండ్ ఈ వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా మంచి విక్టరీతో తన తొలి మ్యాచ్ ఖాతాను మొదలు పెట్టింది న్యూజిలాండ్ టీం. తొమ్మిది వికెట్ల భారీ తేడాతో ప్రత్యర్థి జట్టును చిత్తు చేసి ఘనమైన బోణీ తో టోర్నమెంట్ ఆరంభించింది.


తొలిత టాస్ గెలిచిన న్యూజిలాండ్ వ్యూహాత్మకంగా బౌలింగ్ ని ఎంచుకుంది. ఇంగ్లాండ్ టీం బెన్ స్టోక్స్ లేకుండా బరిలోకి దిగితే మరోపక్క న్యూజిలాండ్ కూడా టీం కెప్టెన్ కేన్ విలియమ్స్ లేకుండానే రంగం లోకి దిగాల్సి వచ్చింది. ఎంతో ఆసక్తికరంగా మొదలైన ఈ ఆటలో ఈసారి న్యూజిలాండ్ గెలుపును సొంతం చేసుకుంది. తొలత బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ టీం నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టానికి 282 పరుగులు చేసింది.

తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది కానీ పాపం కాన్వే, రచిన్ రవీంద్ర ఊహించని విధంగా మెరుపు దాడి చేస్తూ విరుచుకు పడడంతో ఇంగ్లాండ్ ఇరకాటంలో పడిపోయింది.రూట్(77), బట్లర్ (43) స్కోరు సాధించడంతో పాటుగా టెయింలెండర్లు కూడా తమ వంతు ఆట ఆడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు స్కోరు సాధించింది ఇంగ్లాండ్.ఈ మ్యాచ్ లో బెయిర్ (33), మలాన్ (14), బ్రూక్ (25),
మొయిన్ అలీ (11),లివింగ్ స్టోన్(20), సామ్ కర్రన్ (14), క్రిస్ వోక్స్ (11) పరుగులు చేసి అవుట్ అవ్వగా…మార్క్ వుడ్ (13), ఆదిల్ రషీద్ (15) చివరికి అజేయంగా నిలిచారు.కివీస్ బౌలర్ హెన్రీ మూడు వికెట్లు పడగొట్టగా…సాంట్నర్, ఫిలిప్స్ రెండు వికెట్లు సాధించగా….ట్రెంట్ బౌల్ట్, రవీంద్ర తలో వికెట్ పడగొట్టగలిగారు.


283 పరుగుల లక్ష్య ఛేదన తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ టీం తరఫున డెవాన్ కాన్వే, విల్ యంగ్ ఓపెనర్స్ గా బరిలోకి దిగ్గారు.అయితే సామ్ కర్రన్ బౌలింగ్ లో విల్ యంగ్… బట్లర్ చేతికి దొరికి డకౌటయ్యాడు. దీంతో అందరూ న్యూజిలాండ్ ఇక తడబడినట్లే అని అనుకున్నారు. అయితే డెవాన్ కాన్వే,రచిన్ రవీంద్ర క్రీజ్లో నిలదొక్కుకోవడమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌండరీల వైపు పరుగు పెడుతున్న వాళ్ళ షాట్స్ ను ఆపలేక ఇంగ్లాండ్ ఆటగాళ్లు గ్రౌండ్ అంతా పరిగెత్తారు.

న్యూజిలాండ్ ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ కాన్వే 121 బంతులు ఎదుర్కొని 19 ఫోర్లు 3 సిక్స్ లు చేసి 1502 పరుగులు సాధించి నాటౌట్ నిలిచాడు. మరోపక్క రచిన్
రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. ఈ ఇద్దరి ఆటగాళ్ల విధ్వంసకర ఆటతో 36.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ టీం ప్రత్యర్థి స్కోర్ ను అధిగమించి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఐసీసీ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ ఘనంగా ముగిసింది.

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×