EPAPER
Kirrak Couples Episode 1

England Cricket Players: చెత్త రికార్డ్.. ఇంగ్లాండ్ కు ఏమైంది?

England Cricket Players: చెత్త రికార్డ్.. ఇంగ్లాండ్ కు ఏమైంది?

England Cricket Players: అయ్యో..ఎంత పని జరిగింది? ఓడితే ఓడాము పో…ఆఫ్గాన్ తోనే ఓడాలా? ఓడెను పో…అయినను ఇంత చెత్త రికార్డు మాకే రావాలా? వచ్చెను పో…అది మేమెందుకు గుర్తించకుండా పోవలె….
ఇలా ఇంగ్లండు అంతర్మథనం చెందుతూ ఉండవచ్చునని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.


ఇంతకీ ఇంత చెత్త రికార్డ్ ఎందుకొచ్చిందని అంటరా…అదేనండీ…
ఇంగ్లాండు ఏం చేసిందంటే…టెస్ట్ క్రికెట్ ఆడే 11 దేశాల మీద ఓడిపోయింది. మామూలుగా అయితే పర్వాలేదు. కానీ వరల్డ్ కప్ మ్యాచ్ ల్లోనే ఓడిపోవడం వల్ల అదొక చెత్త రికార్డ్ గా నమోదైంది. అంటే అందులో చిన్నా చితకా దేశాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు వారిపాలిట శాపంగా మారింది.  

1979లో వెస్టిండీస్, 1992లో జింబాబ్వే, 2011లో బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఇప్పుడు 2023లో ఆఫ్గనిస్తాన్ చేతుల్లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. అంటే మిగిలిన పెద్ద జట్లతో ఓడటం, గెలవడం
కామన్ అయినా, చిన్న దేశాల చేతిలో ఓటమి పాలవడంతో ఇంగ్లాండ్ పరువు పోయినట్టయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయి ఉండి కూడా ఓటమి పాలవడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో 11 దేశాలతో ఓటమి పాలైన తొలి జట్టుగా మిగలడం…ఇప్పుడు వారికి తలకొట్టేసినట్టయ్యింది.

అయితే వరల్డ్ కప్ గెలిచినా గెలవకపోయినా ఈ రికార్డ్ మాత్రం ఇంగ్లండ్ సొంతమైందని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. ఇంకా జరగాల్సిన 6 మ్యాచ్ లలో వరుసగా అయిదు గెలిస్తేనే ఫలితం ఉంటుందని క్రీడా పండితులు లెక్కలేస్తున్నారు.


Related News

Chess Olympiad 2024: నిరీక్షణకు తెర.. చెస్ ఛాంపియన్ షిప్ లో అదరగొట్టిన ఇండియా..

WTC Final: బంగ్లాపై గెలిచిన టీమిండియాకు కొత్త టెన్షన్‌.. WTC ఫైనల్ చేరాలంటే ఇది చేయాల్సిందే?

India vs Bangladesh: టీమిండియా అదిరిపోయే విక్టర్‌..280 పరుగుల తేడాతో విక్టరీ !

IND vs BAN: రిషబ్ పంత్‌ క్షుద్ర పూజలు…ఇదిగో ఫోటోలు..?

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

Big Stories

×