EPAPER

Ecuador vs Netherlands : బడా టీమ్ బేజార్.. చిన్న జట్టు హుషార్..

Ecuador vs Netherlands : బడా టీమ్ బేజార్.. చిన్న జట్టు హుషార్..

Ecuador vs Netherlands : ఈ టైటిల్‌కు తగ్గట్టుగానే ఉంది… ఫిఫా వరల్డ్‌కప్‌లో పరిస్థితి. ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో పెద్ద జట్లకు చిన్న జట్లు షాకివ్వగా… తాజాగా మరో మ్యాచ్‌లోనూ అదే జరిగింది. నెదర్లాండ్స్‌ను కంగుతినిపిస్తూ… మ్యాచ్‌ను 1-1 గోల్స్ తో డ్రాగా ముగించింది… ఈక్వెడార్.


గ్రూప్-Aలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఈక్వెడార్ మీద నెదర్లాండ్స్ ఈజీగా గెలుస్తుందని భావించారంతా. కానీ ఖతార్ మీద 2-0 గోల్స్ తేడాతో గెలిచి ఊపుమీదున్న ఈక్వెడార్… నెదర్లాండ్స్‌కు అంత తేలిగ్గా లొంగలేదు. సెనగల్‌తో జరిగిన గత మ్యాచ్‌లో చక్కటి హెడర్‌ గోల్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గాక్పో… ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటుతూ ఆరో నిమిషంలోనే గోల్‌ కొట్టడంతో నెదర్లాండ్స్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కూడా ఆ జట్టు గోల్‌ దాడులు కొనసాగించినా… ఈక్వెడార్ సమర్థంగా అడ్డుకుంది. దాంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి నెదర్లాండ్స్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

సెకండ్ హాఫ్ మొదలైన నాలుగో నిమిషంలోనే నెదర్లాండ్స్‌కు షాకిచ్చింది… ఈక్వెడార్. ఖతార్‌తో తొలి మ్యాచ్‌లో డబుల్‌ గోల్‌తో అదరగొట్టిన వాలెన్సియా… 49వ నిమిషంలో గోల్ కొట్టి మళ్లీ ఈక్వెడార్‌ జట్టులో హీరోగా మారాడు. ఈ గోల్‌తో స్కోరు సమం కావడంతో డచ్‌ జట్టు షాకైంది. ఆ తర్వాత ఆధిక్యం సాధించేందుకు నెదర్లాండ్స్‌ తీవ్రంగా శ్రమించినా… ఫలితం లేకపోయింది. సమష్టిగా కదిలిన ఈక్వెడార్‌ ఆటగాళ్లు… నెదర్లాండ్స్‌ మరో గోల్ చేయకుండా అడ్డుకోవడంలో విజయం సాధించారు. చివరికి ఆట ముగిసే సమయానికి రెండు జట్లు 1-1 గోల్స్ తో సమానంగా నిలవడంతో… మ్యాచ్ డ్రా అయింది. ఒక గెలుపు, ఒక డ్రాతో ప్రస్తుతం గ్రూప్‌-Aలో నెదర్లాండ్స్, ఈక్వెడార్‌ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. గ్రూప్‌లో జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లను రెండు జట్లు డ్రా చేసుకున్నా… ప్రీక్వార్టర్స్ చేరతాయి.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×