EPAPER

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

India A win by 186 runs against India D in Duleep Trophy: దులీప్ ట్రోఫీలో ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం ఆర్డీటీ స్పోర్ట్స్ సెంటర్‌లో ఇండియా ‘డి’తో జరిగిన మ్యాచ్‌లో 186 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 488 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా డి టీం 301 పరుగులకే ఆలౌటైంది.


అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 62/1తో ఇండియా ‘డి’ నాలుగో రోజు మొదట గెలుపు దిశగా సాగిన మ్యాచ్.. చివరిలో కీలక వికెట్లు కోల్పోవడంతో తర్వాత బ్యాటర్లు తడబడ్డారు. తెలుగు తేజం రికీ భుయ్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 195 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 113 పరుగులు చేయగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 55 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు, సంజు శాంసన్ 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40 పరుగులతో రాణించారు.

అయితే, మిగతా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలం కావడంతో ఇండియా ‘డి’కి ఓటమి తప్పలేదు. ఇక, ఇండియా ‘ఏ’ బౌలర్లలో తనుష్ కొటియన్ 4 వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్, రియాన్ పరాగ్ తలో వికెట్ పడగొట్టారు.


తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ‘ఏ’ టీం 290 పరుగులు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇక, ఇండియా ‘డి’ టీం తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ ‌లో 301 పరుగులకే ఆలౌటైంది. ఇండియా ‘ఏ’ టీంలో ఆల్ రౌండర్ సామ్స్ ములానీ 89 పరుగులు చేయడంతోపాటు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Also Read: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

ఇదిలా ఉండగా, ఇండియా ‘సి’ , ఇండియా ‘బి’ మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం ఐదోరోజు 309/7 స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇండియా ‘బి’ టీం 332 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు ఈశ్వరన్ 286 బంతుల్లో 14 పోర్లు, సిక్స్‌తో 157 పరుగులు చేశాడు. ఇండియా ‘సి’ బౌలర్లలో అంశుల్ కాభోజ్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇండియా ‘సి’ టీం 128/4 వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 93 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 62 పరుగులు, రజత్ పటిదార్ 84 బంతుల్లో 5 పోర్లతో 42 పరుగులు చేశాడు. ఇక, ఇండియా ‘బి’ రెండో ఇన్నింగ్స్ ఆడినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ‘సి’ 525 పరుగులు చేసింది. ఇందులో 8 వికెట్లతోపాటు 38 పరుగులు చేసిన అన్షుల్ కాంబోజ్ ప్లేయర్ ఆప్ ద మ్యాచ్‌గా ఎన్నికయ్యారు.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×