EPAPER

Dravid warns Rohit, Hardik: ఐపీఎల్ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకండి.. రోహిత్, హార్దిక్ లకు వార్నింగ్ ఇచ్చిన ద్రావిడ్

Dravid warns Rohit, Hardik: ఐపీఎల్ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకండి.. రోహిత్, హార్దిక్ లకు వార్నింగ్ ఇచ్చిన ద్రావిడ్

Rahul Dravid Warned on Handling Hardik Pandya-Rohit Sharma Situation: ఇది నిజమా? అంటే అవునని ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అంటున్నాడు. ఐపీఎల్ సీజన్ 2024లో ముంబై ఇండియన్స్ అట్టడుగు ప్లేస్ కి వెళ్లిపోయింది. ఈ జట్టులో నలుగురు టీమ్ ఇండియా ప్లేయర్లు ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఉన్నారు. అయినా సరే, కెప్టెన్సీ మధ్య వచ్చిన విభేదాలతో జట్టు మొత్తం రెండు గ్రూప్ లుగా విడిపోయింది. దీంతో ఎవరికి వారు ఒక మ్యాచ్ బాగా ఆడి, ఒక మ్యాచ్ చెడగొట్టారు. మొత్తానికి ముంబై జట్టు పేరంతా పోగొట్టారు.


ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఏం చేశాడంటే.. కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇద్దరిని పిలిచి..‘ఐపీఎల్ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకండి’.. అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడని సమాచారం. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ చెప్పడం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది.

‘ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో’తో ఇర్ఫాన్ మాట్లాడుతూ.. కోచ్ ద్రావిడ్ ఏం కోరుకుంటాడో దానిపైనే పాండ్యా నుంచి ఇతర ఆటగాళ్లు అందరూ దృష్టి పెట్టాలని సూచించాడు. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ కారణంగా అంతా జరిగిందనే భ్రాంతితో.. టీమ్ ఇండియాలో గ్రూపులు చేయవద్దని చెప్పినట్టు సమాచారం.


Also Read: పాపువా న్యూగినీపై.. అతికష్టమ్మీద గెలిచిన వెస్టిండీస్

ఇక్కడ రోహిత్ శర్మ పాత్ర కన్నా ఫ్రాంచైజీ పాత్రే ఎక్కువనే సంగతి అందరికీ తెలిసిందే. హార్దిక్ పాండ్యా కూడా అత్యుత్సాహంతో గుజరాత్ ను వదిలి, ముంబై రావడం కూడా వ్యూహాత్మక తప్పిదమే అంటున్నారు. వస్తే తప్పు లేదు. 2025 జట్టుకి తను కాబోయే కెప్టెన్ గా చెప్పి, రోహిత్ శర్మని కొనసాగించి ఉంటే బాగుండేది. ఆ డీల్ సరిగా లేకపోవడంతో ఇంత పెంట జరిగింది తప్ప.. రోహిత్ తప్పు లేదని అంటున్నారు.

ఇదే షోలో పాల్గొన్న మ్యాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇర్ఫాన్ చెప్పింది నిజమేనని అన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏం జరిగిందనేది ఇక్కడ మళ్లీ ప్రస్తావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ఇప్పుడు కేవలం టీ 20 ప్రపంచకప్ ఎలా గెలవాలని మాత్రమేనని అన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ అయిపోయిన చరిత్ర అన్నాడు. టీ 20 ప్రపంచకప్ ప్రస్తుత భవిష్యత్ అని తేల్చి చెప్పాడు.

Related News

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

Babar Azam: ప్రమాదంలో పాకిస్థాన్‌ టీం..బాబర్ ఆజం వార‌సుడు వచ్చేస్తున్నాడు..?

Azharuddin: HCAలో భారీ అక్రమాలు..అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు !

Shardul Thakur: 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్..నువ్వు రియల్‌ హీరో శార్దూల్‌!

Big Stories

×