EPAPER

MS Dhoni: క్రికెట్ లో ధోనీ ఎప్పటికి.. కుర్రాడే!

MS Dhoni: క్రికెట్ లో ధోనీ ఎప్పటికి.. కుర్రాడే!
MS Dhoni
 

MS Dhoni Latest Cricket News In IPL 2024: మహేంద్ర సింగ్ ధోని వయసు 42 సంవత్సరాలు కానీ క్రికెట్ మ్యాచ్ లో అడుగు పెట్టాడంటే, అతను 25 ఏళ్ల వయసువాడిలా అయిపోతాడు. అందుకు ఉదాహరణ.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో జరిగింది.


మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ చివరి ఓవర్ నడుస్తోంది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్ కి వచ్చాడు. ఓవర్ 5 బాల్స్ అయిపోయాయి. చివరి బాల్ మాత్రం మిగిలి ఉంది. దినేష్ కార్తీక్ స్ట్రయికింగ్ లో ఉన్నాడు. లాస్ట్ బాల్ కనెక్ట్ కాలేదు. కానీ నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న అనూజ్ రావత్ వెంటనే పరుగు తీయడానికి ప్రయత్నించాడు.

అయితే అవతలి వైపు కీపర్ పొజిషన్ లో ఉన్నది ధోనీ అన్న సంగతి మరిచిపోయి దూసుకొచ్చేస్తున్నాడు. గమనించిన ధోనీ ఎప్పటిలా ఎక్కడో దూరాన ఉండి కూడా, గురి తప్పకుండా వికెట్ల పైకి క్షణాల్లో బాల్ విసిరాడు. పరిగెడుతూనే చేతిని జస్ట్ ఇలా తిప్పాడు. ఇంకా అనూజ్ రెండడుగుల దూరంలో ఉండగానే బాల్ వెళ్లి బెయిల్స్ ని ఎగరగొట్టింది. అంతే అనూజ్ రన్ అవుట్ అయిపోయాడు.


Also Read: సీఎస్కే ముందు.. మళ్లీ తలవంచిన ఆర్సీబీ.. కొత్త కెప్టెన్ తో జట్టుని గెలిపించిన ధోనీ

ఆ రన్ అవుట్ చేసిన వీడియో నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది. అందరూ శభాష్ ధోనీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏంటి ? 42 వయసులో కూడా అంత షార్ప్ గా బాల్ ని, వికెట్లపైకి ఎలా విసిరాడు? అని ఆశ్చర్యపోతున్నారు. నెట్టిల్లు తెలుసుకదా… అక్కడంతా ఓవర్ యాక్షన్ హై పిచ్ లో నడుస్తుంటుంది.

మొత్తానికి తొలిమ్యాచ్ లో ధోనీ మరొక్కసారి హీరో అయ్యాడు. అంతేకాదు కొత్త కెప్టెన్ గైక్వాడ్ ని దగ్గరుండి నడిపించాడు. కొహ్లీకి ఎలాంటి బాల్స్ వేయాలి.. తన వీక్ నెస్ లు ఏమిటి? ఫీల్డింగ్ ఎక్కడ పెట్టాలి? ఇవన్నీ చర్చించాడు. బౌలర్స్ కి సూచనలు చేశాడు. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వచ్చారు. అంత పేపర్ వర్క్ బహుశా ఆర్సీబీ చేయలేదని అంటున్నారు.

ఏదేమైనా ధోనీ ఇంకా 42 వయసులో కూడా  20 ఓవర్లు కీపింగ్ చేయడం అంటే మాటలు కాదు…నిజానికి ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఒక పేరు వచ్చిన తర్వాత  కీపర్ గా చేయడానికి నామోషీ ఫీలవుతారు. కానీ ధోనీ అలా కాదు.. లెజండరీ క్రికెటర్ అయినా, కీపింగ్ చేస్తూనే ఉంటాడు. క్రికెట్ ని, దేశాన్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దటీజ్ దోనీ.. అందుకే తనకి అంత పేరు వచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Ind vs NZ: తగ్గిన వర్షం..టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న టీమిండియా…జట్లు ఇవే

Ind vs NZ: బెంగళూరులో మరో 3 రోజులు వర్షాలు..టెస్ట్‌ మ్యాచ్‌ రద్దు కానుందా?

Big Stories

×