EPAPER

Dean Elgar : కోహ్లీ ఉమ్మేశాడు.. కానీ సారీ చెప్పి, పార్టీ ఇచ్చాడు: డీన్ ఎల్గర్

Dean Elgar : కోహ్లీ ఉమ్మేశాడు.. కానీ సారీ చెప్పి, పార్టీ ఇచ్చాడు: డీన్ ఎల్గర్
Dean Elgar

Dean Elgar : టీమ్ ఇండియాలో కీలక ఆటగాడు విరాట్ కొహ్లీపై తాజాగా ఒక దుమారం రేగింది. క్రికెట్ లోకి వచ్చిన ప్రారంభంలో విరాట్ చాలా కోపంగా ఉండేవాడు. అంతే దూకుడిని ఆటలో చూపించేవాడు. అది అతనికి ప్లస్ అయ్యింది. కానీ వ్యక్తిగతంగా అదే తీరు చాలా వివాదాలను తీసుకొచ్చింది. ఒకసారి ఒకరిని కొట్టిన ఉదంతం పెద్ద దుమారాన్నే రేపింది. బీసీసీఐ కల్పించుకోవాల్సి వచ్చింది.


అలాంటి కొహ్లీ తనకు తాను యోగా లాంటివి చేసి, కోపాన్ని తగ్గించుకున్నాడు. ఇప్పుడు జెంటిల్మన్ గా మారిపోయాడు. కానీ అప్పుడు చేసినవి ఇప్పుడు కూడా వెంటాడటం కొంచెం బాధాకరమేనని చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే కొహ్లీపై సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

తాజాగా ‘బాంటర్ విత్ బాయ్స్’ అనే ఓ పోడ్ కాస్ట్‌లో పాల్గొన్న డీన్ ఎల్గర్.. ఒక సంచలన విషయం తెలిపాడు. 2015 లో సౌతాఫ్రికా భారత పర్యటనకు వచ్చింది. మొహాలీ వేదికగా జరిగిన టెస్టులో బ్యాటింగ్‌కు దిగాను. అప్పుడే నేను విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూశానని తెలిపాడు.


ఓపెనర్ గా వచ్చి బ్యాటింగ్ చేస్తున్న నాపై అశ్విన్, జడేజా సూటి పోటి మాటలతో ఇబ్బంది పెట్టారు. నేను వారికి గట్టిగానే బదులిస్తున్నాను. ఈ మధ్యలోకి విరాట్ వచ్చాడు. సడన్ గా నాపై ఉమ్ము వేశాడు. అంతే నా కోపం పీక్స్ కి వెళ్లింది. ఒక బూతు పదం వాడాను. అంతేకాదు బ్యాట్ తీసుకుని ఒక్కటేస్తానని చెప్పాను.

తర్వాత నేను వాడిన పదాన్నే పదే పదే కొహ్లీ నన్ను ఉద్దేశించి అనడం మొదలుపెట్టాడు. ఇలాంటి వాడితో అనవసరమని చెప్పి వదిలేశాను. ఆ గొడవ మధ్య ఫస్ట్ ఇన్నింగ్స్ లో 37, సెకండ్ ఇన్నింగ్స్ లో 16 పరుగులు చేశాను. ఈసారి నా క్యాచ్ కొహ్లీ పట్టి, గ్రౌండ్ లో చాలా హడావుడి చేశాడు.

ఆ సంఘటన తర్వాత 2017-18లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వచ్చింది. కోహ్లీలో చాలా మార్పు చూశాను. తను పూర్తిగా మారిపోయాడు. గతంలో చేసిన తప్పిదాలన్నిటికి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు కనిపించాడు. ఆ క్రమంలో నా వద్దకు వచ్చి సిన్సియర్ గా సారీ చెప్పాడు. భారత పర్యటనలో నేను నీతో ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదని చెప్పి, మనం కలిసి డ్రింక్ చేద్దామా? అన్నాడు.

తనిప్పుడు డ్రింక్ మానేశాడు. కానీ అప్పుడు తీసుకునేవాడు. అయితే తన మాటల్లో నిజాయితీ నచ్చి సరే అన్నాను. ఇద్దరం కలిసి తెల్లవారుజామున 3 గంటల వరకు గడిపాం. చాలా కబుర్లు చెప్పుకున్నాం. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తాజాగా భారత్ తో జరిగిన సిరీస్ లో రిటైర్ అయినప్పుడు ఎంతో ఆత్మీయంగా నన్ను హగ్ చేసుకుని శుభాకాంక్షలు చెప్పాడని అన్నాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×