EPAPER

David Warner : మిచెల్ కి స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన డేవిడ్

David Warner : మిచెల్ కి స్ట్రాంగ్ డోస్ ఇచ్చిన డేవిడ్
David Warner

David Warner : బౌలర్ మిచెల్ జాన్సన్, బ్యాటర్ డేవిడ్ వార్నర్ మధ్య మాటల పోరు నడుస్తోంది. మిచెల్ తన మాటలతో పదునైన బాల్స్ వేస్తున్నాడు. దీనికి వార్నర్ కూడా తగిన రీతిలో సమాధానమిచ్చి ప్రతి బాల్ ని  గ్రౌండ్ దాటిస్తున్నాడు.


ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉండి, తాజాగా మిచెల్ కి స్ట్రాంగ్ డోస్ ఒకటిచ్చాడు. కొద్దిరోజుల్లో పాక్ తో టెస్ట్ సిరీస్ ప్రారంభం అవుతుండగా ఇదేం తలనొప్పి అని ఆస్ట్రేలియా జట్టు, బోర్డు సభ్యులు తలలు పట్టుకుంటున్నారు.

డిసెంబర్ 14 నుంచి పెర్త్ లో పాకిస్తాన్ తో ఆస్ట్రేలియా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లోనే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ వేడుకలకు క్రికెట్ ఆస్ట్రేలియా ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.


ఈ క్రమంలో ఉన్నట్టుండి సీనియర్ ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ జాన్సన్ దీనిని తీవ్రంగా విమర్శించాడు. ఒక నిషేధం విధించిన క్రికెటర్ ని ఇలా ఎవరైనా సన్మానిస్తారా? ఇది పద్ధతేనా? అని తీవ్రంగా దుయ్యబట్టాడు.

దీనికి డేవిడ్ వార్నర్ స్ట్రాంగ్ కౌంటర్ ఏమిచ్చాడంటే .. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తర్వాత ప్రపంచం అందరి ద్రష్టి ఆటగాళ్లపైనే ఉంటుంది. ఎంతోమంది ఎన్నో అంటూ ఉంటారు. ఎంతమందికని బదులు ఇచ్చుకుంటూ వెళతాం. అది మూర్ఖత్వమే అవుతుంది. అలాగే అందరూ మెచ్చుకోవాలని అనుకోవడం కూడా కరెక్ట్ కాదని అన్నాడు.

ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉంది. వాటిని పట్టించుకుంటూ వెళితే, మనం అక్కడే ఆగిపోతాం. కానీ నేను ముందుకు సాగాలంటే, వాటిని దాటుకు వెళ్లాల్సిందే. లేదని అక్కడే కూర్చుంటే సమయం వృధా అవుతుందని తెలిపాడు.

నా తల్లిదండ్రుల గొప్ప పెంపకంలో పెరిగాను. మాట్లాడే మాట దగ్గర నుంచి, గౌరవం ఇచ్చిపుచ్చుకునే వరకు అన్నీ వారు నేర్పించారు. నేను ప్రతిరోజూ కష్టపడుతూనే ఉన్నాను. ఏదో అల్లాటప్పాగా ఈ స్థాయికి వచ్చినవాడిని కాదని తెలిపాడు. ఆ కష్టమే నన్ను గౌరవప్రదమైన స్థాయికి తీసుకువచ్చిందని తెలిపాడు.

ఈ రిటైర్మెంట్ ముందు అద్భుతమైన టెస్ట్ ముగింపు లభిస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా ద్రష్టి అంతా నా జీవితంలో, నా దేశం తరఫున ఆడే ఆఖరి మ్యాచ్ పైనే ఉంది. నన్ను అభిమానించే నా ఫ్యాన్స్ అందరికీ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి సంతోషంగా రిటైర్ కావాలని కోరుకుంటున్నానని అన్నాడు.

దీనిని చూసిన డేవిడ్ వార్నర్ అభిమానులందరూ శభాష్ అని కామెంట్ చేస్తున్నారు. అందరూ మద్దతుగా నిలుస్తున్నారు. మన ఇండియాలోని అభిమానులైతే ‘తగ్గేదేలే’అంటున్నారు. మా పుష్ప ఎప్పుడూ అలాగే ఉండాలి అని కోరుతున్నారు.

చివరికి మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఏమన్నాడంటే ఈ వివాదం సద్దు మణగాలంటే వాళ్లిద్దరూ కూర్చుని పరిష్కరించుకోవాలని తెలిపాడు. లేకపోతే ఈ మంట ఇప్పుడిప్పుడే చల్లారేలా లేదని అన్నాడు. అది క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎంత మాత్రం మంచిది కాదని అన్నాడు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×