EPAPER

David Warner: డేవిడ్ వార్నర్‌ కు రూట్‌ క్లియర్‌..నిషేధం ఎత్తివేత !

David Warner: డేవిడ్ వార్నర్‌ కు రూట్‌ క్లియర్‌..నిషేధం ఎత్తివేత !

David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ( David Warner ) భారీ ఊరట లభించింది. తాజాగా ఆస్ట్రేలియా ( Australia ) బ్యాటర్ డేవిడ్ వార్నర్ పై.. సస్పెన్షన్ ను ఎత్తివేశారు. ఇటీవల తన టెస్ట్ రిటైర్మెంట్.. వెనుక్కు తీసుకుంటానని ప్రకటించిన డేవిడ్ వార్నర్ కు.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. అతనిపై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని… ఎత్తివేసేందుకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ముందుకు వచ్చింది.


David Warner Lifetime Leadership Ban Lifted by Cricket Australia Ahead of Big Bash League

ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయింది. దీంతో డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్ ay.. అందరి ముందుకు రాబోతున్నాడు అన్నమాట. వాస్తవంగా 2018 సంవత్సరంలో సాండ్ పేపర్ స్కాండల్ నేపథ్యంలో… డేవిడ్ వార్నర్.. కెప్టెన్సీ పై నిషేధం పడిన సంగతి తెలిసిందే. ఎవరో చేసిన తప్పిదం కారణంగా డేవిడ్ వార్నర్ పై నిషేధం విధించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్. అయితే తనపై బ్యాన్ తొలగించాలని… చాలాసార్లు మొత్తుకున్నాడు డేవిడ్ వార్నర్ ( David Warner ) .

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు చాలా సార్లు విజ్ఞప్తి కూడా చేశారు డేవిడ్ వార్నర్. కానీ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం పట్టించుకోలేదు. అయితే దీనిపై తాజాగా ముగ్గురితో కూడిన.. కమిటీ వేసింది ఆస్ట్రేలియా. ఈ కమిటీ నిర్ణయం మేరకు… డేవిడ్ వార్నర్ పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో రాబోయే బిగ్ బాష్ లీగ్ లో.. ఫ్రాంచైజీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. డేవిడ్ వార్నర్ ( David Warner ) సిడ్నీ థండర్స్‌ కు నాయకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Also Read: Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

ఇక ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పట్ల… డేవిడ్ వార్నర్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపాడు డేవిడ్ వార్నర్. ఇది ఇలా ఉండగా… 2018లో సాండ్ పేపర్ స్కాం జరిగిన సంగతి తెలిసిందే. స్టీవ్ స్మిత్ ( Steev Smith) అప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్ గా ఉన్నాడు. 2018 సంవత్సరంలో నాలుగు టెస్టుల సిరీస్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్ళింది ఆస్ట్రేలియా. ఇందులో రెండు టెస్టులను ఆస్ట్రేలియా (Australia) అటు దక్షిణాఫ్రికా చెరొకటి గెలిచాయి. దీంతో సిరీస్ సమమైంది.

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

కానీ మూడో టెస్టుల్లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో.. ఆస్ట్రేలియా ప్లేయర్ బాన్ క్రాఫ్ట్.. బంతిని రుద్దుతూ దొరికిపోయాడు. సాండ్ పేపర్ లా ఉన్న గుడ్డ ముక్కను జేబులో ఉంచి… దాచిపెట్టినట్లు దక్షిణాఫ్రికా ఆరోపణలు చేసింది. ఆ సమయంలో వైస్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. అయితే డేవిడ్ వార్నర్ చెప్పినట్లుగానే… చేసినట్టు బ్రాడ్ క్రాఫ్ట్… విచారనలో తెలిపారు. దీంతో డేవిడ్ వార్నర్ తో స్టీవ్ స్మిత్ పైన కూడా వేట్ పడింది.

Related News

IND VS NZ: 156 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

IND VS NZ: కుప్పకూలిన భారత టాప్ ఆర్డర్..7 వికెట్లు డౌన్ !

Emerging Asia Cup 2024: నేడు సెమీస్‌ పోరు…ఆఫ్ఘానిస్తాన్ తో టీమిండియా ఫైట్‌

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

Big Stories

×