EPAPER

David Warner : ‘నా క్యాప్ పోయింది.. దొరికితే ఇచ్చేయండి’.. వార్నర్ ఎమోషనల్ పోస్ట్!

David Warner : ‘నా క్యాప్ పోయింది.. దొరికితే ఇచ్చేయండి’.. వార్నర్ ఎమోషనల్ పోస్ట్!

David Warner : ఎప్పుడూ సరదాగా, సంతోషంగా, హాయిగా నవ్వుతూ ఉండే ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. హఠాత్తుగా ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దీంతో నెట్టింట అందరూ ఏమైంది? ఏమైంది? అని ఆత్రుతగా అడగడం మొదలుపెట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే, తన బ్యాగీ గ్రీన్ (క్యాప్) ఎయిర్ పోర్టులో పోయిందని తెలిపాడు.


టెస్ట్ మ్యాచ్ కోసం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ వెళ్తున్న సమయంలో లగేజ్ నుంచి బ్యాగీ గ్రీన్ (క్యాప్) మాయమైందని తెలిపాడు. ఎలా జరిగిందో తెలీదని అన్నాడు. ఒకవేళ పొరపాటున పడిపోయి ఉంటే, తనపై అభిమానంతో తిరిగిచ్చేయమని వేడుకున్నాడు. అది తనకెంతో సెంటిమెంట్ అని, కావాలంటే అలాంటి క్యాప్ మరొకటి ఇస్తానని అన్నాడు.

విమానయాన సంస్థ క్వాంటాస్‌ను అడిగితే తమ కెమెరాలు చెక్ చేశామని, బ్యాక్‌ప్యాక్ ఓపెన్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదని చెప్పారని అన్నాడు. తనను కానీ, క్రికెట్ ఆస్ట్రేలియాను కానీ సోషల్ మీడియా ద్వారా సంప్రదించి తన క్యాప్ ఇస్తే వారికి మంచి గిఫ్ట్ అందిస్తానని కూడా తెలిపాడు.


ఇంతకీ ఆ క్యాప్ గొప్పతనం ఏమిటని అందరూ ఆరా తీస్తున్నారు. ఒక క్యాప్ పోతే మరొకటి క్రికెట్ ఆస్ట్రేలియా ఇవ్వదా? అని అడుగుతున్నారు. లేదంటే ఆ క్యాప్ పెట్టుకున్నప్పుడు తనేమైన అద్భుతంగా ఆడాడా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే.. టెస్టు అరంగేట్రం చేసినప్పుడు ఆస్ట్రేలియా ఆటగాళ్లు తొలిసారి ఆ బ్యాగీ గ్రీన్ క్యాప్‌ను పొందుతారు. దానిని ప్రతీ ఆస్ట్రేలియా ఆటగాడు  ఎంతో గౌరవంగా భావిస్తారు.  అందుకే వార్నర్ ఇన్నాళ్లూ ఎంతో భద్రంగా దాచుకున్నాడు. సొంతమైదానంలో తన ఫేర్‌వెల్ మ్యాచ్ గ్రాండ్‌గా జరగనున్న సమయంలో ఇలా జరగడంతో షాక్ కి గురయ్యాడు.

అందరూ అనేమాట ఏమిటంటే వార్నర్ మంచివాడేకాదు, ఎంతో సున్నిత మనస్కుడు.. అందుకే ఎవరైనా దొరికితే ఇచ్చేయమని వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు.  ఎవరైనా ఇద్దామని అనుకున్నా, ఇంత అల్లరి జరిగిన తర్వాత ఇవ్వడానికి భయపడతారని కామెంట్ చేస్తున్నారు.

దొరికింది కదా.. అని ఇచ్చేయవచ్చు కదా.. అని మరొకరు సలహా చెబుతున్నారు. మొత్తానికి వార్నర్ క్యాప్ కూడా చివర్లో తనలాగే సెన్సేషన్ సృష్టించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×