EPAPER
Kirrak Couples Episode 1

David Warner : ఇక మూసేయ్యండి నోళ్లు.. సెంచరీతో డేవిడ్ వార్నర్ సమాధానం

David Warner : ఇక మూసేయ్యండి నోళ్లు.. సెంచరీతో డేవిడ్ వార్నర్ సమాధానం
David Warner

David Warner : క్రికెట్ లో ఎప్పటి నుంచో వాడుక మాట ఒకటి ఉంది. ఏ బ్యాటర్ అయినా ఫామ్ కోల్పోయినప్పుడు బయట పబ్లిక్ నుంచి, సీనియర్ల నుంచి రకరకాలుగా మాటలు పడాల్సి వస్తుంటుంది.  క్రికెట్ ఆడనివాళ్లు కూడా ఇలా ఆడకుండా ఉండాల్సింది, షాట్ సెలక్షన్ రాంగ్ పడింది, అయినా ఎందుకంత తొందరపడ్డాడు? ఇలా రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు.


వన్డే వరల్డ్ కప్ 2023 సమయంలో అప్పటి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా ఒక మాటన్నాడు. టీవీల ముందు కూర్చుని ప్రతీ ఒక్కరూ కబుర్లు చెప్పేవాళ్లే. గ్రౌండ్ లో ఆడితే తెలుస్తుందని అన్నాడు.  ఇలాంటి సమయంలో కౌంటర్లు ఇచ్చేవారికి.. జనరల్ గా వాడుకలో వినిపించే మాట ఇది…

‘నిన్ను విమర్శించేవాళ్లకి ఎప్పుడూ మాటలతో కాదు… నీ బ్యాట్ తో సమాధానం చెప్పు’ అని అంటూ ఉంటారు. ఇప్పుడదే మాటను ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రుజువు చేశాడు. తన కెరీర్ లో ఆఖరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న వార్నర్ కి సన్మానం విషయంలో మిచెల్ జాన్సన్ అన్నమాటలు క్రికెట్ ఆస్ట్రేలియాలో మంటలు పుట్టించాయి.
నిషేధం విధించిన వాడిని ఎవరైనా గౌరవిస్తారా? అని జాన్సన్ మండిపడ్డాడు. దీనిపై రకరకాలుగా కామెంట్లు వినిపించాయి.


ఇప్పుడు తన కెరీర్ లో పాకిస్తాన్ తో ఆఖరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న వార్నర్ చాలా దూకుడుగా, కసిగా ఉన్నాడు. ఆ ధాటికి తొలి రోజు ఆటలో టీ సమయానికి వార్నర్ సెంచరీ చేసి (114) నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆసీస్ రెండు వికెట్లకు 210 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్. ఉస్మాన్ ఖవాజా (41) 126 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఖవాజా నిలకడగా ఆడగా, వార్నర్ మాత్రం వన్డే ఆటను తలపించేలా ఆడాడు. తర్వాత లబుషేన్ (16) త్వరగానే పెవెలియన్ చేరాడు.

ఈ క్రమంలో స్మిత్ తో కలిసి స్కోరు బోర్డుని వార్నర్ ముందుకు నడిపించి సెంచరీ చేశాడు. ఇది  కెరీర్ లో వార్నర్ కి 49వ సెంచరీ. టెస్టుల్లో 26వ సెంచరీగా ఉంది. తదనంతరం టీ బ్రేక్ లో వార్నర్ మాట్లాడాడు.  నా రిటైర్మెంట్ సమయంలో సెంచరీతో ముగింపు ఇవ్వాలని అనుకున్నాను. అది సాధ్యమైంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే నా ముందున్న లక్ష్యం అంటూనే ఒక గట్టి కౌంటర్ కూడా ఇచ్చాడు. ‘విమర్శకులకు నోరు మూయించడానికి ఇంతకంటే గొప్ప మార్గం లేదు…ఇక అందరూ మూసుకోండి…అని అన్నాడు. ఇది మిచెల్ జాన్సన్ గురించేననే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Related News

IND vs BAN 1st Test Match: గిల్, పంత్ సెంచరీలు: తొలిటెస్టులో… విజయం దిశగా భారత్

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

Big Stories

×