EPAPER

CSK vs LSG : చెన్నై, లక్నో మ్యాచ్ రద్దు.. రెండు జట్లకు చెరో పాయింట్

CSK vs LSG : చెన్నై, లక్నో మ్యాచ్ రద్దు.. రెండు జట్లకు చెరో పాయింట్

CSK vs LSG : వర్షం కారణంగా చెన్నై, లక్నో మధ్య మ్యాచ్ రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. 19.2 ఓవర్లలో లక్నో టీమ్‌ 7 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. అదే సమయంలో వర్షం పడటంతో ఆట నిలిచిపోయింది. 40 నిమిషాలకుపైగా మ్యాచ్‌కు అంతరాయం కలగడంతో.. లక్ష్యాన్ని 19 ఓవర్లలో 127 పరుగులుగా నిర్ధారించారు.


ముందుగా టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ..  పిచ్‌పై తేమ అధికంగా ఉండడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టును బ్యాటింగ్‌కు పిలిచాడు. బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లోనే చెన్నై బౌలర్ మొయిన్ అలీ నుంచి గట్టి స్ట్రోక్ ఎదురైంది.  ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌‌ను 14 పరుగులకే ఔట్ చేశాడు. ఐదో ఓవర్లో మరో ఓపెనర్‌ మనన్‌ వోహ్రా, కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యాలను చెన్నై బౌలర్ మహీశ్‌ తీక్షణ వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. అప్పటికి లక్నో స్కోర్‌ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు మాత్రమే. ఆ తర్వాత కూడా LSG వికెట్ల పతనం ఆగలేదు. ఏడో ఓవర్‌ ఐదో బంతికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ ఔటయ్యాడు. 10వ ఓవర్లో కరన్‌ శర్మ.. మొయిన్‌ అలీకి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అప్పటికి లక్నో చేసిన స్కోరు 5 వికెట్ల నష్టానికి 44 పరుగులు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆయుష్‌ బదోనీ ధాటిగా ఆడాడు. 33 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. నికోలస్‌ పూరన్‌ 20 పరుగులు చేశాడు.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, మహీశ్‌ తీక్షణ, మతీశ పతిరన తలా రెండు వికెట్లు తీసుకున్నారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్‌ దక్కింది.


Related News

IPL 2025: ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్‌పై కొత్త పంచాయితీ…చిక్కుల్లో ఓనర్లు?

Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Ind vs Ban 1st T20: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్లు, టైమింగ్స్ వివరాలు ఇవే !

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

×