Big Stories

CSK vs GT: గుజరాత్ తగ్గేదేలే.. చెలరేగిన సుదర్శన్.. చెన్నైకి 215 పరుగుల బిగ్ టార్గెట్..

gt bating

CSK vs GT:
గుజరాత్ స్కోర్ 214/4
చెలరేగి ఆడిన సాయి సుదర్శన్ (96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు)
వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5×4, 1×6)
శుభ్‌మన్‌ గిల్‌ (39), హార్దిక్‌ పాండ్య (21*)
చెన్నైకి 215 పరుగుల టార్గెట్

- Advertisement -

వర్షం పడి తడిగా ఉన్న గ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ చెలరేగి ఆడింది. సొంత గ్రౌండ్, సొంత ప్రేక్షకుల సమక్షంలో చెన్నై బౌలింగ్‌ను ఊచకోత కోసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చింది గుజరాత్. 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల కోల్పోయి 214 పరుగులు చేసింది. చెన్నై ముందు 215 పరుగుల బిగ్ టార్గెట్ పెట్టి.. గట్టి సవాల్ చేసింది.

- Advertisement -

మొదట్లో ఫైనల్ ప్రెజర్ గుజరాత్ ఆటగాళ్లలో కనిపించింది. ఇన్నింగ్స్ నెమ్మదిగా స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఓవర్లో జస్ట్ 4 పరుగులు మాత్రమే చేసింది. భారీ అంచనాలతో బరిలో దిగిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కి ప్రారంభంలోనే లైఫ్ దొరికి బతికిపోయాడు. రెండో ఓవర్లో తుషార్ వేసిన బాల్‌కు భారీ షాట్ కొట్టాడు. అయితే, బంతి చాహర్ చేతికి చిక్కినా.. అతను కిందపడటంతో సేవ్ అయ్యాడు. దొరికిన లైఫ్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకొని.. చెన్నైని చితక్కొట్టేశాడు. పాండే ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదేశాడు. రవీంద్ర జడేజా వేసిన బాల్‌.. స్లిప్ అవగా.. కీపర్ ధోనీ మెరుపు వేగంతో స్టెంపౌట్ చేశాడు. ఆ స్టెంప్ అవుట్‌ను చూసి తీరాల్సిందే. శుభ్‌మన్‌ గిల్‌ (39; 20 బంతుల్లో 7×4) మెరుపు ఇన్నింగ్స్‌ అలా ముగిసింది.

గిల్ అవుట్ కావడం గుజరాత్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. కానీ, ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ మరింత చెలరేగి ఆడాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో చెన్నై బౌలింగ్‌న్ ఆటాడుకున్నాడు. 96 రన్స్ ధనాధన్ కొట్టేశాడు. సెంచరీకి ముందు అవుటయ్యాడు. ఇంకో ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5×4,1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ( 21*, 12 బంతుల్లో 2×4) రన్స్ చేశాడు.

చెన్నై బౌలర్లలో పతిరణ 2 వికెట్లు, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌ చెరో వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News