EPAPER

Cristiano Ronaldo : రికార్డుల రారాజు రొనాల్డో..!

Cristiano Ronaldo : రికార్డుల రారాజు రొనాల్డో..!
cristiano ronaldo

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో.. ఫుట్‌బాల్‌కు పర్యాయపదంగా నిలిచిన పేరు. అన్నింటికీ మించి రికార్డుల రారాజు. ఫుట్‌బాల్ లెజెండ్‌‌ కావడానికి కారణం అతని కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష కారణం. ఇదేమీ ఆషామాషీగా దక్కిన విజయం కాదు. తొలినాళ్లలో ఎన్నో ప్రతికూలతలను చవిచూశాడు. కుటుంబానికి ఆర్థిక ఆసరా ఇచ్చేందుకు వీధుల వెంట చిన్నచితకా పనులు చేశాడు. అయితే ఇవేవీ అతని లక్ష్యాన్ని దూరం చేయలేకపోయాయి.


గత రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్ క్రీడాజగత్తుపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ఆ క్రీడకు అంతగా ఆదరణ లేని దేశాల్లోనూ గుర్తింపు పొందాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన రొనాల్డో ఈ రోజు 39వ పుట్టిన రోజును జరుకుంటున్నాడు. పోర్చుగల్‌లోని మడిరియాలో 5 ఫిబ్రవరి 1985లో జన్మించాడు. 16వ ఏట పోర్చుగల్‌లో స్పోర్టింగ్ సీపీ తరఫున ఆడటంతో అతని కెరీర్ ఆరంభమైంది.

అండర్ 16, అండర్ 17, అండర్ 18 బీ-జట్ల తరఫున ఆడాడు. 2002లో సీనియర్ టీం సభ్యుడి స్థాయికి ఎదిగాడు. 2008-09 సీజన్‌లో రియల్ మాడ్రిడ్ క్లబ్‌లో చేరాడు. అప్పట్లోనే 80 యూరో మిలియన్ల‌ విలువైన ఆ ఒప్పందం ద్వారా అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకి ఎక్కాడు. ఆ తర్వాత రొనాల్డో వెనుతిరిగి చూసింది లేదు. ఆ క్లబ్ తరఫున ఆడిన 9 ఏళ్లలో అతనే లీడింగ్ గోల్ స్కోరర్‌. మొత్తం 438 మ్యాచుల్లో 450 గోల్స్ సాధించాడు. 2011-12 నుంచి 2017-18 వరకు నాలుగు సార్లు ఛాంపియన్‌గా మాడ్రిడ్‌ క్లబ్‌ను నిలపడంలో ప్రధాన పాత్ర అతడిదే.


అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోనూ పోర్చుగల్ తరఫున ఆల్‌టైమ్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు రొనాల్డో. మొత్తం 128 ఇంటర్నేషనల్ గోల్స్ సాధించడం విశేషం. అదే ఇప్పటివరకు ప్రపంచ అత్యధిక రికార్డు. పోర్చుగల్ తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ ట్రోఫీలు గెలవడంలో రొనాల్డోది అద్వితీయమైన పాత్ర. 2011 నుంచి 2014 వరకు సగటున ఏడాదికి 60 గోల్స్‌ చేసి ఫుట్‌బాల్‌లో సరికొత్త రికార్డులు సృష్టించాడు.

2023లో వరల్డ్ టాప్ గోల్ స్కోరర్‌గా రొనాల్డో నిలిచాడు. పోర్చుగల్, అల్ నసర్ టీం తరఫున మొత్తం 54 గోల్స్ అతని ఖాతాలో పడ్డాయి. 5 చాంపియన్స్ లీగ్ టైటిల్స్ సాధించిన ఫుట్‌బాలర్ అతడే. మాడ్రిడ్ తరఫున 4 సార్లు, మాంచెప్టర్ యునైటెడ్ తరఫున ఒక సారి ఆ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. తన కెరీర్‌లో 873 గోల్స్ సొంతం చేసుకున్న లెజెండరీ ప్లేయర్ రొనాల్డో.

Tags

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×